దేశవ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నారు. దేశం కోసం పనిచేసిన వారందరిని స్మరించుకుంటూ జాతీయ గీతాన్ని ఆలపిస్తాం. నటుడు శివరాజ్‌కుమార్ కూడా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. శివరాజ్‌కుమార్, గీతా శివరాజ్‌కుమార్, దర్శకుడు గురుదత్ రిపబ్లిక్ డేకి శక్తిధామ్ వెళ్లారు. అక్కడి చిన్నారులతో కలిసి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. అక్కడ చదువుకుంటున్న విద్యార్థుల ఖర్చులను దివంగత పునీత్ రాజ్‌కుమార్ చూసుకునేవారు. ఉదయం శివరాజ్‌కుమార్(శివన్న), అతని భార్య గీత మైసూర్‌లో 'శక్తిధామ్' పిల్లలతో కలిసి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. శివన్న 'శక్తిధామ్' పిల్లలకు స్వీట్లు పంచారు.
పునీత్ రాజ్‌కుమార్ మరణానంతరం.. శివన్న, అతని భార్య గీత శక్తిధామ్‌ను సందర్శించారు. అనాథ బాలికలను చదివించేందుకు డాక్టర్ రాజ్‌కుమార్ కుటుంబం మైసూర్‌లో 'శక్తిధామ్'ను స్థాపించింది. గతంలో పార్వతమ్మ రాజ్‌కుమార్ శక్తిధామ్ బాధ్యతను తీసుకున్నారు. ఆమె తర్వాత పునీత్ రాజ్‌కుమార్ బాలికలకు చదువు చెప్పించేందుకు నడుం బిగించారు. పునీత్ మరణాంతరం శివరాజ్‌కుమార్, అతని భార్య గీతా శివరాజ్‌కుమార్ ఇప్పుడు శక్తిధామ్ చూసుకుంటున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం శివన్న మఠంలోని పిల్లలతో కాసేపు గడిపారు. ఇదిలావుంటే గత ఏడాది అక్టోబర్ 29న పునీత్ రాజ్‌కుమార్ ఈ లోకాన్ని వీడారు. ఆయన మరణం దేశాన్ని శోకసంద్రంలో ముంచేసింది.