శివన్న సినిమా.. అంత త్వరగా ఓటీటీలోనా?
శివ రాజ్ కుమార్.. శివన్నగా కన్నడ ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నాడు.
By Medi Samrat Published on 13 Nov 2023 8:01 PM IST
శివ రాజ్ కుమార్.. శివన్నగా కన్నడ ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నాడు. ఆయన తెలుగు వాళ్లకు కూడా చిరపరిచితుడే!! ఆయన నటించిన 'ది ఘోస్ట్' సినిమా చాలా త్వరగా ఓటీటీలో విడుదల కాబోతోంది. శివ రాజ్ కుమార్ హీరోగా నటించిన 'ఘోస్ట్' సినిమా.. సెప్టెంబరు 19న కన్నడలో రిలీజైంది. మంచి కలెక్షన్స్ ను కన్నడనాట సొంతం చేసుకుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్ కథతో తీసిన ఈ చిత్రం తెలుగులో రెండు వారాలు లేటుగా నవంబరు 4న విడుదలైంది. అయితే తెలుగు సినిమాల విడుదల ఎక్కువగా ఉండడం.. ప్రమోషన్స్ పెద్దగా లేకపోవడంతో సినిమా మన వాళ్లకు పెద్దగా తెలియకుండాపోయింది. ఇక ఈ సినిమా ఓటీటీ విడుదలకు కూడా సిద్ధమవుతూ ఉంది.
తెలుగులో రిలీజైన రెండు వారాల్లోలోపే ఓటీటీ లోకి వస్తోంది. నవంబరు 17 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. పంచ్‌లు, ఫైట్లు, టఫ్ డైలాగ్స్‌ని ఇష్టపడే వారందరికీ ‘ఘోస్ట్’ సినిమా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఓటీటీలో తెలుగు వాళ్లకు బాగా కనెక్ట్ అవుతుందని ఆశిస్తూ ఉంది చిత్ర యూనిట్.