శివకార్తికేయన్ 'ప్రిన్స్'కు అదిరిపోయే కలెక్షన్స్

Shiva Karthikeyan Prince Movie Collections. జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు

By Medi Samrat  Published on  22 Oct 2022 7:45 PM IST
శివకార్తికేయన్ ప్రిన్స్కు అదిరిపోయే కలెక్షన్స్

జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనుదీప్ కేవీ, తమిళ నటుడు శివకార్తికేయన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా 'ప్రిన్స్'. శివ కార్తికేయన్ తొలిసారి నేరుగా తెలుగు సినిమా చేశారు. ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. 'ప్రిన్స్' చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. నైజాం ఏరియాలో రూ. 35 లక్షలు, ఏపీలో రూ. 55 లక్షల వసూళ్లు లభించాయి. మొత్తంగా తెలుగులో రూ. 90 లక్షల వసూళ్లు రాబట్టింది. తమిళ్ లో మాత్రం ఈ చిత్రానికి మంచి కలెక్షన్స్ దక్కుతున్నాయి. తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం ఏకంగా ఏడు కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది. విదేశాల్లో కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ట్వీట్ చేశారు.

ఈ చిత్రంలో శివకార్తికేయన్ స్కూల్ టీచర్ పాత్రలో నటించారు. ఆయన సరసన ఉక్రెయిన్ కు చెందిన మరియా హీరోయిన్ పాత్ర పోషించింది. హీరో తండ్రిగా సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు. కార్తీ సర్దార్- శివకార్తికేయన్ ప్రిన్స్ ఈ దీపావళికి తమిళంలో విడుదలైన భారీ చిత్రాలు. మణిరత్నం యొక్క పొన్నియిన్ సెల్వన్ I సినిమా తర్వాత రెండు సినిమాలు విడుదలయ్యాయి, ఈ రెండు సినిమాలు ఇంకా పొన్నియిన్ సెల్వన్ I నుండి గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి. సర్దార్ సినిమా తమిళనాడు రాష్ట్రంలో రూ.3.50 కోట్లతో.. మిగతా ఏరియాల్లో కలిపి 5.75-6 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా తెలిపారు. ప్రిన్స్ యుఎస్ఎలో మంచి ఓపెనింగ్స్ సాధించగా, సర్దార్ సింగపూర్, మలేషియాలో మంచి ఓపెనింగ్స్ సాధించింది.


Next Story