నటి ఇంటికి పోలీసులు.. 60 కోట్లపై ఆరా..!

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి 60 కోట్ల రూపాయల మోసం కేసులో విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు.

By -  Medi Samrat
Published on : 7 Oct 2025 2:49 PM IST

నటి ఇంటికి పోలీసులు.. 60 కోట్లపై ఆరా..!

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి 60 కోట్ల రూపాయల మోసం కేసులో విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు. ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) అధికారులు ఆమె నివాసానికి వెళ్లి దాదాపు నాలుగున్నర గంటల పాటు శిల్పా శెట్టిని ప్రశ్నించి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

2015 నుంచి 2023 మధ్య కాలంలో వ్యాపార విస్తరణ పేరుతో శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా తన వద్ద నుంచి రూ. 60 కోట్లకు పైగా తీసుకుని, ఆ డబ్బును వ్యక్తిగత ఖర్చుల కోసం వాడుకుని మోసం చేశారని వ్యాపారవేత్త దీపక్ కొఠారీ తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ విచారణ సందర్భంగా, శిల్పా శెట్టి తన అడ్వర్టైజింగ్ కంపెనీకి చెందిన బ్యాంకు ఖాతా లావాదేవీల వివరాలను పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన కీలకమైన పత్రాలను కూడా ఆమె అధికారులకు అందజేశారు. ఇదే కేసులో గత సెప్టెంబర్ నెలలోనే శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను కూడా ఈఓడబ్ల్యూ అధికారులు విచారించారు. అవసరమైతే అతడిని మరోసారి విచారణకు పిలుస్తామని అప్పట్లో పోలీసులు తెలిపారు.

Next Story