భర్త అరెస్టు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన శిల్పా శెట్టి
Shilpa Shetty On Husband Raj Kundra's Arrest. శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రా అరెస్ట్‌పై ఈరోజు ఒక ప్రకటనను తన సోషల్ మీడియా అకౌంట్ లో
By Medi Samrat Published on 2 Aug 2021 2:06 PM IST
శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రా అరెస్ట్‌పై ఈరోజు ఒక ప్రకటనను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేశారు. తన మీద ఉన్న ఆరోపణలు, అనవసరమైన వార్తలు, పుకార్లు, ఆరోపణలను నమ్మకండని అన్నారు. మీడియా ట్రయల్స్ విషయంలో కూడా కీలక వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. సత్యమేవ జయతే అని శిల్పా శెట్టి సోషల్ మీడియాలో అన్నారు. 46 ఏళ్ల నటి గత కొన్ని రోజులుగా సవాలుగా ఉందని, తనకు తన కుటుంబానికి చాలా ట్రోలింగ్, ప్రశ్నలు ఎదురయ్యాయని అన్నారు. నా స్టాండ్ ... నేను యిప్పటికి కామెంట్ చేయలేదని అన్నారు.
గత కొన్ని రోజులుగా తమకి ఛాలెంజింగ్‌గా సాగిందని, ఇకపై తప్పుడు ప్రచారాన్ని, నెగిటివ్ కామెంట్లు ఆపండని అన్నారు. మీడియా, శ్రేయోభిలాషులు కూడా మాపై కామెంట్లు, ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. నేను ఇంకా ఎలాంటి కామెంట్ చేయలేదు. నేను నాస్టాండ్ మీద ఉన్నాను. ఈ కేసు విషయంలో నేను స్పందించలేను. దయజేసి తప్పుడు ప్రచారాన్ని ఆపాదించడం ఆపివేయండని నా తరఫున కోరుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతుంది.
పోలీసులపై, భారతీయ న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. ఓ ఫ్యామిలీగా మేం అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన పరిష్కారాలను ఆశ్రయిస్తున్నామన్నారు. కానీ అప్పటి వరకు నేను వినయంగా అడుగుతున్నా. ముఖ్యంగా ఓ తల్లిగా, నా పిల్లల కోసం మా గోప్యతని గౌరవించమని, నిజనిజాలేంటో ధృవీకరించకుండా సగం సగం సమాచారంపై వ్యాఖ్యానించడం మానుకోవాలని అభ్యర్థిస్తున్నానని చెప్పుకొచ్చారు శిల్పా. నేను ఈ రంగంలో 29ఏళ్లుగా ఉన్నాను. కష్టపడి ఈ స్థాయికి వచ్చా. ప్రజలు నాపై విశ్వాసం ఉంచారు. నేను ఎవరినీ నిరాశపర్చలేదు. కాబట్టి ఈ కాలంలో నా కుటుంబం, గోప్యతపై నా హక్కుని గౌరవించాలని కోరుతున్నానన్నారు.