శిల్పా శెట్టి.. చెబుతోందిదే..!

Shilpa Shetty About Raj Kundra Case. బాలీవుడ్ పోర్న్ వీడియోల కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on  23 July 2021 11:41 AM GMT
శిల్పా శెట్టి.. చెబుతోందిదే..!

బాలీవుడ్ పోర్న్ వీడియోల కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. 2009లో శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా పెళ్లి చేసుకోగా.. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. తన భర్త అరెస్టైన తర్వాత శిల్పాశెట్టి తొలిసారి మౌనం వీడారు. ప్రముఖ రచయిత జేమ్స్ థర్బర్ రచించిన పుస్తకంలోని వాక్యాలను ఆమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. 'కోపంలో ఉన్నప్పుడు వెనక్కి చూడకు, భయంగా భవిష్యత్తును చూడకు, పూర్తి అవగాహనతో చుట్టుపక్కల చూడు అంటాడు జేమ్స్ థర్బర్. మనల్ని బాధ పెట్టిన వారి వైపు కోపంతో వెనక్కి తిరిగి చూస్తాం. ఉద్యోగం పోతుందేమో అనే భయంతోనో, ఏదైనా రోగం బారిన పడతామనో, మనకు ఇష్టమైన వ్యక్తిని కోల్పోతామనే భయంతోనో భవిష్యత్తును చూస్తాం. నేను బతికే ఉన్నాననే విషయం తెలుసుకుని దీర్ఘంగా ఊపిరి తీసుకుంటా. గతంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా. భవిష్యత్తులో కూడా సవాళ్లను ఎదుర్కొంటా. ఈరోజు నేను జీవించడాన్ని ఏ శక్తి కూడా ఆపలేదు' అనే వాక్యాలను ఆమె షేర్ చేశారు. రాజ్ కుంద్రా HotHit యాప్ నుండి రోజుకు ఒకటి నుండి 10 లక్షల రూపాయలు సంపాదించేవారని కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. ఈ డబ్బును తన బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకునేవారని మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి.

అరెస్ట్‌ చేయకుండా ఉండేందుకు పోలీసులకు రాజ్ కుంద్రా ఏకంగా రూ.25 లక్షలు లంచంగా ఇచ్చారని.. ఈ విషయాన్ని ఇదే కేసులో నిందితుడిగా ఉన్న అరవింద్‌ శ్రీవాత్సవ అలియాస్‌ యశ్‌ ఠాకూర్‌ పోలీసులకు పంపిన ఓ మెయిల్‌లో ఆరోపించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అరవింద్‌ శ్రీవాత్సవను అరెస్ట్‌ చేయడానికి ప్రయత్నించగా రాజ్‌ కుంద్రా మాదిరి మీరు కూడా రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు మార్చిలో ఏసీబీకి పంపిన ఈమెయిల్‌లో తెలిపారు. అమెరికాకు చెందిన ఫ్లిజ్‌ మూవీస్‌ సంస్థకు సీఈఓగా ఉన్న అరవింద్‌ శ్రీవాత్సవ ఏసీబీకి ఈమెయిల్‌ చేశారు. ఈ సంవత్సరం మార్చిలో ఏసీబీ ముంబైలోని సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. రూ.4.5 కోట్లు ఉన్న రెండు బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపజేశారు. ఇదే కేసులో అప్పట్లో రాజ్‌కుంద్రా అరెస్ట్‌ కాకుండా రూ.25 లక్షలు ఇచ్చారని ఈ మెయిల్ లో చెప్పుకొచ్చారు.


Next Story
Share it