బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకోబోతోంది. జహీర్ ఇక్బాల్ అనే వ్యక్తిని జూన్ 23 న వివాహం చేసుకోబోతోంది సోనాక్షి. అయితే ఈ పెళ్లి సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హాకు ఇష్టం లేదంటూ రూమర్లు వైరల్ అయ్యాయి. అయితే ఆయన ఒక్క ఫోటోతో ఈ రూమర్లకు చెక్ పెట్టారు. శత్రుఘ్న సిన్హా తన కాబోయే అల్లుడు జహీర్ ఇక్బాల్‌తో కలిసి జూన్ 20న తన నివాసంలో కనిపించారు. జహీర్ కు శత్రుఘ్న సిన్హా ఆశీర్వాదం ఇవ్వడమే కాకుండా ఫోటోలకు పోజులిచ్చారు. జూన్ 20న, సోనాక్షి సిన్హా, ఆమె కుటుంబం జహీర్ ఇక్బాల్ నివాసంలో కనిపించారు. అక్కడ వారు కలిసి భోజనాలు చేశారు. ఆ సమయంలో శత్రుఘ్న సంతోషంగా కనిపించడమే కాకుండా.. అతని అల్లుడు జహీర్‌తో కలిసి ఫోటోలు దిగారు.
జూన్ 23న సోనాక్షి, జహీర్‌ల వివాహం కోర్టులో జరగనుంది. ఆ తర్వాత ముంబైలోని బాస్టియన్‌లో వివాహ వేడుక జరగనుంది. సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దాదాపు ఏడేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు.