మనమే.. సెన్సార్ రిపోర్టు ఇదిగో.!
ఒకే ఒక జీవితం (2022) విజయం తరువాత, శర్వానంద్ వ్యక్తిగత కారణాలతో సినిమాలకు రెండేళ్ల విరామం తీసుకున్నాడు.
By Medi Samrat Published on 6 Jun 2024 12:15 PM ISTఒకే ఒక జీవితం (2022) విజయం తరువాత, శర్వానంద్ వ్యక్తిగత కారణాలతో సినిమాలకు రెండేళ్ల విరామం తీసుకున్నాడు. అంతేకాకుండా యుఎస్‌కు చెందిన టెక్కీని పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత 'మనమే' సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు శర్వానంద్. ‘మనమే’ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఇందులో ఉప్పెన (2021) ఫేమ్ కృతి శెట్టి కథానాయికగా నటించింది. ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేశారు మేకర్స్.
మనమే 2 గంటల 35 నిమిషాల రన్‌టైమ్ తో వచ్చింది. ఈ సినిమాకు ‘U/A’ సర్టిఫికేట్ ఇచ్చారు. వెన్నెల కిషోర్ సహాయక పాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని ప్రేమ, కుటుంబం, పిల్లాడు జీవితంలోకి వస్తే చోటు చేసుకునే ఘటనలు లాంటి వాటి ద్వారా తెరకెక్కించారు. ఈ చిత్రానికి హేషామ్ అబ్దుల్ వహాబ్ స్వరాలు సమకూర్చారు. శర్వానంద్ మనమే సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ చిత్రం నటుడి కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ అని చెబుతున్నారు. సినిమాలో ఎక్కువ భాగం లండన్‌లో చిత్రీకరించారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఈ సినిమాలో శర్వానంద్ అల్ట్రా స్టైలిష్‌గా, కృతి శెట్టి ఎంతో అందంగా కనిపిస్తూ ఉంది. మనమే ట్రైలర్ యువత, కుటుంబాలను ఆకట్టుకుంటుంది.