ఈ హీరోయిన్ రూటే వేరు.. ప్రేమ మైకంలో పడి సొంత తమ్ముడినే చంపించిందా..?

Shanaya Katwe Murdered Her Brother. షనాయా కాట్వే.. కన్నడలో హీరోయిన్ గా ఒకట్రెండు సినిమాల్లో కనిపించింది.

By Medi Samrat  Published on  23 April 2021 7:21 PM IST
ఈ హీరోయిన్ రూటే వేరు.. ప్రేమ మైకంలో పడి సొంత తమ్ముడినే చంపించిందా..?

షనాయా కాట్వే.. కన్నడలో హీరోయిన్ గా ఒకట్రెండు సినిమాల్లో కనిపించింది. ఒందు గంటేయ కథ, ఇదం ప్రేమమ్ జీవనమ్ వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఇప్పుడు ఆమె పేరు కన్నడ చిత్ర పరిశ్రమలో తెగ వినిపిస్తోంది. ఇంతకూ ఆమె పేరు ఎక్కువగా వినిపించడానికి కారణం ఏమిటో తెలుసా..? ఆమె ఒక క్రైమ్ లో భాగమవ్వడమే..!

ఆమెపై సొంత తమ్ముడ్నే చంపించిందనే అభియోగాలు మోపబడ్డాయి. తన ప్రేమ వ్యవహారానికి తమ్ముడు అడ్డం వస్తున్నాడనే కారణంతో ప్రియుడితో కలిసి అడ్డు లేకుండా చేసిందని పోలీసులు తెలిపారు. షనాయా కాట్వే మేనేజర్ నియాజ్ అహ్మద్ తో ప్రేమ వ్యవహారం నడుపుతోంది. షనాయా ప్రేమను ఆమె సోదరుడు రాకేశ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. నియాజ్ అహ్మద్ కు దూరంగా ఉండాలని చెప్పాడు. ప్రియుడి మోజులో ఉన్న షనాయాకు తమ్ముడు అడ్డొస్తున్న విషయాన్ని తన ప్రియుడు నియాజ్ కు చెప్పింది. తమ ప్రేమకు రాకేశ్ అడ్డుగా ఉన్నాడని భావించి అతడ్ని హత్య చేయడానికి పథకాన్ని రచించారు.

నియాజ్, అతడి గ్యాంగ్ కలిసి రాకేశ్ ను చంపేసి అతడి మృతదేహాన్ని కారులో దాచారు. ఆ మృతదేహం కుళ్లి వాసన వస్తే దొరికిపోతామని భావించి, రాకేశ్ మృతదేహాన్ని పలు భాగాలుగా నరికి హుబ్బళ్లి పరిసర ప్రాంతాల్లో విసిరేశారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేయగా.. ఈ హత్యకు పాల్పడింది నియాజ్ అని గుర్తించారు. ఈ హత్య వెనుక రాకేశ్ సోదరి షనాయా కాట్వే ఉందని తెలుసుకుని ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు.


Next Story