షనాయా.. మరో స్టార్ కిడ్ ను లాంఛ్ చేస్తున్న కరణ్ జోహార్..!

Shanaya Kapoor marks her big Bollywood debut with Bedhadak. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ మరో స్టార్ కిడ్ ను లాంఛ్ చేస్తున్నాడు.

By Medi Samrat
Published on : 3 March 2022 11:53 AM IST

షనాయా.. మరో స్టార్ కిడ్ ను లాంఛ్ చేస్తున్న కరణ్ జోహార్..!

బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ మరో స్టార్ కిడ్ ను లాంఛ్ చేస్తున్నాడు. ఇప్పటికే పలువురు స్టార్స్, డబ్బున్నోళ్ల పిల్లలను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన కరణ్.. షనాయా కపూర్ ను హీరోయిన్ గా లాంఛ్ చేస్తున్నాడు. కరణ్ జోహార్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. ధర్మ ప్రొడక్షన్స్ కుటుంబంలోకి ముగ్గురు కొత్త సభ్యులను పరిచయం చేస్తున్నట్లు తెలిపాడు. ఈరోజు ఉదయం 10 గంటలకు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ముగ్గురు కొత్త యాక్టర్స్ ను పరిచయం చేశాడు. శశాంక్ కహితన్ దర్శకత్వం వహిస్తున్న బేధడక్ సినిమాలో లక్ష్య, షనయా కపూర్, గుర్ఫతేలు కీలక పాత్రలు పోషిస్తున్నారని కరణ్ జోహార్ తెలిపాడు.

బాలీవుడ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్న టీవీ నటుల్లో లక్ష్య లాల్వానీ ఒకరు. అతడు దోస్తానా 2తో బాలీవుడ్‌లో అరంగేట్రం చేయబోతున్నాడు. తన మొదటి సినిమా విడుదలకు ముందే ధర్మ ప్రొడక్షన్స్‌ లో తన రెండవ చిత్రాన్ని పొందాడు. ఈ చిత్రంలో షనాయా లక్ష్యతో రొమాన్స్‌ చేయనుంది. షనాయ కపూర్ బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్, మహీప్ కపూర్ కుమార్తె. అంతకుముందు, 2012లో, కరణ్ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌' తో ముగ్గురు కొత్తవారిని పరిచయం చేశాడు. సిద్ధార్థ్ మల్హోత్రా సినిమా కుటుంబానికి చెందినవారు కానప్పటికీ, అలియా భట్, వరుణ్ ధావన్ ఇద్దరూ స్టార్ కిడ్స్. అలియా భట్ మహేష్ భట్- సోనీ రజ్దాన్ ల కుమార్తె, వరుణ్ ధావన్ డేవిడ్ ధావన్ కుమారుడు.


Next Story