150 కోట్ల బడ్జెట్ సినిమాకు.. ఇంత ఘోరమైన కలెక్షన్స్ ఉన్నాయా..?

Shamshera struggles on Day 2. నటుడు రణబీర్ కపూర్ పీరియాడికల్ యాక్షన్ చిత్రం 'షంషేరా' బాక్స్ ఆఫీస్

By Medi Samrat  Published on  25 July 2022 5:24 PM IST
150 కోట్ల బడ్జెట్ సినిమాకు.. ఇంత ఘోరమైన కలెక్షన్స్ ఉన్నాయా..?

నటుడు రణబీర్ కపూర్ పీరియాడికల్ యాక్షన్ చిత్రం 'షంషేరా' బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన కలెక్షన్స్ ను పొందుతూ ఉంది. రూ.150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన యష్ రాజ్ ఫిలింస్ సినిమా.. తొలిరోజు రూ.10.25 కోట్లు మాత్రమే రాబట్టింది. 2వ రోజు బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి వృద్ధిని చూపలేదు.

ప్రముఖ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ చిత్రం యొక్క మొదటి రెండు రోజుల కలెక్షన్లను పంచుకుంటూ "#Shamshera 2వ రోజు కష్టాలు ఎదుర్కొంటోంది. మాస్ ప్రాంతాల్లో కూడా సినిమాను పెద్దగా చూడకపోవడం ఆందోళన కలిగిస్తోంది. శుక్ర 10.25 కోట్లు, శనివారం 10.50 కోట్లు. మొత్తం: రూ. 20.75 కోట్లు బిజినెస్ చేసింది" కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన భారీ బడ్జెట్ డ్రామా తొలి రెండు రోజుల్లో దాదాపు రూ.20.75 కోట్లు వసూలు చేసింది.








Next Story