శాకుంతలం విషయంలో షాక్ అవుతున్న సినీ అభిమానులు

Shakuntalam shines in ‘Cannes. గుణశేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన పౌరాణిక ప్రేమకథా చిత్రం ‘శాకుంతలం’ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే..!

By Medi Samrat  Published on  28 May 2023 6:15 PM IST
శాకుంతలం విషయంలో షాక్ అవుతున్న సినీ అభిమానులు

గుణశేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన పౌరాణిక ప్రేమకథా చిత్రం ‘శాకుంతలం’ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే..! ఈ సినిమాతో భారీ నష్టాలను చూడాల్సి వచ్చిందని.. నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు కూడా చెప్పారు. ఈ సినిమాలో సమంత , దేవ్ మోహన్ జంటగా నటించారు. ప్రస్తుతం ఓటీటీలో ఈ చిత్రం సందడి చేస్తోంది.

ఈ సినిమా అవార్డులను కొల్లగొడుతూ ఉండడంతో షాక్ అవుతూ ఉన్నారు. కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌ 2023లో ఈ చిత్రం నాలుగు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్‌ ఫారెన్‌ ఫిల్మ్‌, బెస్ట్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ , బెస్ట్‌ ఫాంటసీ ఫిల్మ్‌ , బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌ కు గానూ ‘శాకుంతలం’ చిత్రం ‘కేన్స్‌ వరల్డ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’‌లో అవార్డులు సొంతం చేస్తున్నట్లుగా గుణ టీమ్ వర్క్స్ సంస్థ ట్వీట్ చేసింది. ఈ సినిమా మీద సాధారణ ప్రేక్షకులు పెదవి విరిచినప్పటికీ.. అవార్డులు తెస్తూ ఉండడంతో చిత్ర యూనిట్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తోంది.


Next Story