నా పెళ్లి ఫిక్స్ అయ్యి క్యాన్సిల్ అయ్యింది: షకీలా

Shakeela About Her Marriage. షకీలా.. ఒక‌ప్ప‌టి శృంగారతార‌. నాకు పెళ్లి ఫిక్స్ అయింది.. కానీ కొన్ని కారణాల వల్ల పెళ్లి ఆగిపోయింది అంటూ ఆమె తెలిపారు.

By Medi Samrat  Published on  21 Jan 2021 3:32 PM IST
Shakeela

షకీలా.. ఒక‌ప్ప‌టి శృంగారతార‌. అప్ప‌ట్లో ఆమె సినిమా ఎప్పుడు రిలీజ‌వుతుందా అని ఎంతోమంది ఆతృత‌తో వేచి చూసేవారంటే ఆమె చిత్రాలు ఏ స్థాయిలో అల‌రించేవో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న షకీలా.. తన నిజ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది. నిజానికి తనకు ఇండస్ట్రీ లోకి రావడం ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల తన తల్లి కోరిక మేరకు సినిమాలలో నటించడానికి ఒప్పుకున్నారు.

అయితే తాజాగా షకీలా, అనురాధ ఈటీవీ లో ప్రసారమయ్యే "ఆలీతో సరదాగా"ఈ కార్యక్రమానికి వచ్చి తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఆటో బయోగ్రఫీ అంటే అందులో అన్నీ నిజాలే ఉండాలి. అందుకే తన జీవితంలో ఎదుర్కొన్న అన్ని కష్టసుఖాల గురించి తన స్వీయ జీవితచరిత్రలో వెల్లడించానని ఈ సందర్భంగా షకీలా తెలియజేశారు. ఈ సందర్భంలోనే తన వివాహం గురించి మాట్లాడుతూ కొంత భావోద్వేగానికి గురయ్యారు.నాకు పెళ్లి ఫిక్స్ అయింది.. కానీ కొన్ని కారణాల వల్ల పెళ్లి ఆగిపోయింది అంటూ ఆమె తెలిపారు.

వివాహం కుదరడం వల్ల పెళ్లి తేదీని కూడా ఖరారు చేసే పెళ్లి కార్యక్రమాలలో మునిగిపోయాము. అమ్మ చనిపోయిన తర్వాత నా సర్వస్వం తనేనని భావించాను. అయితే రోకా సమయంలో ఆ వ్యక్తి బాగా మద్యం తాగి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతూ గొడవ చేశాడు. ఈ తరుణంలోనే మా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం వల్ల అతనిని పెళ్లి చేసుకోనని చెప్పినట్లు షకీలా తెలిపారు. ఆ విధంగా తన పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని, ఇప్పటికీ ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు తనతో మాట్లాడుతూనే ఉంటారని తెలిపారు.

లాక్ డౌన్ తరువాత టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ దర్శకుడు తనకు ఫోన్ చేసి తన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడని ఆ విధంగా ఆ దర్శకుడు ఫోన్ చేసినప్పుడు తనకు కన్నీళ్లు ఆగలేదని ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ విధంగా షకీలా, అనురాధ గురించి మరి కొన్ని ఆశక్తికర విషయాలు తెలుసుకోవాలంటే జనవరి 25 వరకు ఆగాల్సిందే.



Next Story