షారుఖ్ ఖాన్ సెక్యూరిటీ కూడా హై అలర్ట్
ఇటీవల బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు జరగడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.
By Medi Samrat Published on 18 April 2024 3:30 PM ISTఇటీవల బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు జరగడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. దీంతో మరో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ భద్రత గురించి అధికారులు కీలక చర్యలు తీసుకుంటున్నారు. షారుఖ్ ఖాన్ సెక్యూరిటీ విషయంలో కూడా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ వెలుపల ఇద్దరు బైక్‌పై షూటర్లు కాల్పులు జరపడంతో బాలీవుడ్ వర్గాల్లో చాలా ఆందోళన కలిగించింది. దీంతో షారూఖ్ ఖాన్‌కు ఇటీవల భద్రతను పెంచారు. షారుఖ్ IPL మ్యాచ్ సందర్భంగా KKRకి మద్దతు కోల్‌కతాలో ఉన్నాడు. అతను తిరిగి ఇంటికి వెళ్లే వరకూ చాలా భద్రతను పెంచారు. ఆయన చుట్టూ అంగరక్షకులు, పోలీసులు, స్టేడియం భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు.
సల్మాన్‌ఖాన్ ఇంటి దగ్గర కాల్పుల కేసులో గుజరాత్‌లో బిష్ణోయ్ క్రిమినల్ ముఠాకు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ జాయింట్ పోలీస్ కమిషనర్ లక్ష్మీ గౌతమ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిందితులు మొత్తం ఐదు రౌండ్లు కాల్పులు జరిపారని తెలిపారు. బీహార్‌కు చెందిన విక్కీ గుప్తా (24), సాగర్ పాల్ (21) అనే ఇద్దరు కుర్రాళ్లు ఆదివారం ఉదయం సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు జరిపిన తర్వాత పారిపోయారు. సోమవారం రాత్రి గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని మాతా నో మద్ గ్రామం నుంచి పోలీసులు వారిని పట్టుకున్నారు.