షారుఖ్ సినిమాకు భారీగా బిజినెస్

Shah Rukh Khan's King-Style Comeback Helps Jawan To Earn 250 Crores' Income Even Before Its Release. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ నటిస్తున్న సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతూ ఉన్నాయి.

By Medi Samrat  Published on  25 Sept 2022 7:00 PM IST
షారుఖ్ సినిమాకు భారీగా బిజినెస్

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ నటిస్తున్న సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతూ ఉన్నాయి. మూడు సినిమాలలో షారుఖ్ ఖాన్ బిజీగా ఉన్నాడు. భారీ రిలీజ్ లను ప్లాన్ చేస్తున్నాడు. 2018లో వ‌చ్చిన 'జీరో' త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు షారుఖ్ ఖాన్ సినిమా రాలేదు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ ఖచ్చితంగా హిట్ అందుకుంటాడని బాలీవుడ్ జనాలు కూడా ఎదురుచూస్తూ ఉన్నారు. షారుక్‌ ఖాన్ 2023 లో భారీ సినిమాలతో అభిమానుల ముందుకు రానున్నాడు. జనవరి 25, 2023న పఠాన్‌తో అభిమానులను పలకరించనున్నాడు. దీపికా పదుకొణె, జాన్ అబ్రహంతో కలిసి ఈ సినిమాలో నటిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత, అట్లీ దర్శకత్వం వహించిన 'జవాన్‌'లో నయనతారతో కలిసి నటిస్తున్నాడు. 2023 చివరి నాటికి, తాప్సీ పన్నుతో కలిసి రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో 'డుంకీ'లో కనిపించనున్నాడు.

అట్లీ దర్శకత్వం వహిస్తున్న జవాన్ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరపుకుంటుంది. టీజ‌ర్ సినిమాపై విప‌రీత‌మైన అంచ‌నాలను క్రియేట్ చేశాయి. ఈ చిత్రానికి నాన్‌-థియేట్రికల్‌ బిజినెస్‌ భారీ రేంజ్‌లో జరిగిందని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. అన్ని భాషలకు కలుపుకుని దాదాపు రూ.250 కోట్లకు ఈ మూవీ డిజిటల్‌, శాటిలైట్‌ హక్కులు అమ్ముడయ్యాయని అంటున్నారు. జీ సంస్థ శాటిలైట్ హక్కులు దక్కించుకోగా.. నెట్‌ఫ్లిక్స్ సంస్థ డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకుందని బాలీవుడ్ మీడియా చెబుతోంది. ఇక ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి కీలకపాత్రలో నటించనుండడంతో దక్షిణాదిన కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు.


Next Story