బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్‌కు బెదిరింపులు
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్‌కు హత్య బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.
By Medi Samrat Published on 7 Nov 2024 2:19 PM ISTగ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్‌కు హత్య బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ షారుక్ ఖాన్‌కు కూడా బెదిరింపులు వచ్చిన్నట్లు తెలుస్తుంది. రాయ్‌పూర్‌కు చెందిన వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ వార్త బయటకు రావడంతో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచం మరోసారి షాక్‌కు గురైంది. ఈ విషయంపై దర్యాప్తు చేసేందుకు ముంబై పోలీసులు అలర్ట్ మోడ్‌లోకి వచ్చారు. బెదిరింపు చేసిన వ్యక్తి కోసం వెతకడం ప్రారంభించారు.
షారుఖ్ ఖాన్ నవంబర్ 2న తన 59వ పుట్టినరోజు జరుపుకున్నాడు సరిగ్గా 5 రోజుల తర్వాత ఆయనను చంపేస్తానని బెదిరింపు కేసు వెలుగులోకి రావడం అందరినీ షాక్‌కు గురి చేసింది. అయితే దీని వెనుక ఉన్న కారణాలేమిటనేది ఆయన్ను ఎందుకు టార్గెట్ చేశారనే విషయం మాత్రం వెల్లడి కాలేదు. ముంబయి పోలీసులు కూడా నిందితుడిని కనుగొనడానికి రాయ్‌పూర్‌కు బయలుదేరారు. ఈ ప్రమాదకరమైన కుట్రను ఎవరు పన్నుతున్నారో క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తారు.
ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్‌కు షారుక్ ఖాన్‌ను చంపేస్తానని బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు వార్తల ఆధారంగా చెబుతున్నారు. అంతే కాదు ప్రాణాల కావాలంటే కోట్లాది రూపాయలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. దీంతో ముంబై పోలీసులు రంగంలోకి దిగారు. అయితే ఈ విషయంపై షారుక్ గానీ.. ఆయన సిబ్బంది గానీ ఇంకా అధికారిక ధృవీకరణ చేయలేదు.
బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో ముంబై పోలీసులు షారుక్ ఖాన్ ముంబై హౌస్ మన్నత్ వెలుపల భద్రతను పెంచారు. అంతకుముందు సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు వస్తున్న దృష్ట్యా గెలాక్సీ అపార్ట్‌మెంట్ వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లతో భారీ పోలీసు బలగాలను మోహరించారు. గతంలో సల్మాన్ స్నేహితుడు, రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులకు గురిచేసి హత్య చేసింది.