సరికొత్త చరిత్ర సృష్టించిన షారుఖ్ ఖాన్

జవాన్ బ్లాక్ బస్టర్ విజయం బాలీవుడ్ కు మంచి ఊపు తెప్పించింది.

By Medi Samrat  Published on  25 Sept 2023 8:00 PM IST
సరికొత్త చరిత్ర సృష్టించిన షారుఖ్ ఖాన్

జవాన్ బ్లాక్ బస్టర్ విజయం బాలీవుడ్ కు మంచి ఊపు తెప్పించింది. రెండు సినిమాలతో 1,000 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ నటుడుగా షారూఖ్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన 'పఠాన్' కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. పఠాన్ కంటే జవాన్ సినిమా అద్భుతంగా ఉందని మెచ్చుకుంటూ ఉండడంతో జవాన్ అధికారికంగా 1000 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరింది. రెండు 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన భారతీయ సినిమాల్లో షారుక్ ఖాన్ ఏకైక హీరోగా నిలిచాడు.

షారూఖ్ ఖాన్ జవాన్, హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్, బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ చూసింది. నయనతార, విజయ్ సేతుపతితో పాటు దీపికా పదుకొణె, సంజయ్ దత్ ప్రత్యేక పాత్రల్లో నటించిన ఈ చిత్రం, తొలిరోజు భారతదేశంలో 75 కోట్ల రూపాయల భారీ వసూళ్లను సాధించింది. జవాన్ సినిమా దంగల్, బాహుబలి 2, RRR, KGF 2, గదర్ 2, పఠాన్‌ సినిమాల లిస్టులోకి చేరి 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఏడవ భారతీయ చిత్రంగా అవతరించింది. ఈ ఏడాది షారుక్ ఖాన్ డబుల్ బ్లాక్ బస్టర్ సినిమాలను సొంతం చేసుకోగా. అపజయమెరుగని బాలీవుడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీతో చేస్తున్న 'డుంకీ' సినిమా ఈ ఏడాది రాబోతోంది. ఇది క్రిస్మస్ కానుకగా రానుంది. షారూఖ్‌ ఖాన్ ​​హ్యాట్రిక్ హిట్ సాధించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

Next Story