సొంత ఓటీటీని తీసుకుని వస్తున్న షారుఖ్ ఖాన్

Shah Rukh Khan Announces His New OTT App. ఇప్పటికే ఓటీటీ బిజినెస్ లోకి పలువురు స్టార్స్ అడుగుపెట్టారు. ఇప్పుడు బాలీవుడ్ కింగ్ ఖాన్

By Medi Samrat  Published on  15 March 2022 1:33 PM GMT
సొంత ఓటీటీని తీసుకుని వస్తున్న షారుఖ్ ఖాన్

ఇప్పటికే ఓటీటీ బిజినెస్ లోకి పలువురు స్టార్స్ అడుగుపెట్టారు. ఇప్పుడు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ వంతు. షారుఖ్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా తాను సరికొత్త ఓటీటీని తీసుకుని రాబోతున్నానని ప్రకటించారు. షారుఖ్ ఖాన్ SRK+ అని పిలవబడే ఓటీటీని ప్రారంభిస్తున్నానని తెలిపారు. "కుచ్ కుచ్ హోనే వాలా హై, OTT కి దునియా మే (OTT ప్రపంచంలో ఏదో జరగబోతోంది)" అని షారుఖ్ ఖాన్ తన హిట్ చిత్రం కుచ్ కుచ్ హోతా హై టైటిల్‌ను సూచిస్తూ ఈరోజు పోస్ట్ చేశాడు. SRK ఇప్పుడు స్ట్రీమింగ్‌ యాప్ కు కూడా వస్తుండడంతో అభిమానులు ఎంతో థ్రిల్‌ అవుతున్నారు.

SRK+ అనేది ఒక యాప్ అని సల్మాన్ ఖాన్ తెలిపాడు. "ఆజ్ కి పార్టీ తేరీ తరఫ్ సే (ఈ రోజు పార్టీ మీరే ఇవ్వాలి). మీ కొత్త OTT యాప్, SRK+కి అభినందనలు." అని సల్మాన్ చెప్పుకొచ్చారు. చిత్రనిర్మాత అనురాగ్ కశ్యప్ SRK+తో అనుసంధానం అవుతున్నట్లు ప్రకటించారు. "డ్రీమ్ కమ్ ట్రూ! కొత్త OTT యాప్, SRK+లో @iamsrkతో కలిసి పని చేస్తున్నాను" అని అనురాగ్ కశ్యప్ ట్వీట్ చేశారు. సంవత్సరంలో అతిపెద్ద వార్త. ఇది OTT రూపురేఖలను మార్చబోతోంది. చాలా ఉత్సాహంగా ఉంది" అని షారుఖ్ ఖాన్ స్నేహితుడు, దర్శకుడు కరణ్ జోహార్ ట్వీట్ చేశారు. షారుఖ్ ఖాన్ ప్రస్తుతం పఠాన్ సినిమాలో నటిస్తూ ఉన్నాడు. ఆ సినిమాలో భారీ తారాగణం ఉంది.










Next Story