సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో విచారణ ముగిసిన అనంతరం అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని బన్నీకి అధికారులు తెలిపారు. తమకు అందుబాటులో ఉండాలని చెప్పారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని అల్లు అర్జున్ అధికారులకు తెలిపారు. విచారణ ముగిసిన తర్వాత అల్లు అర్జున్ పోలీస్ ఎస్కార్ట్ తో పీఎస్ నుంచి ఇంటికి చేరుకున్నారు
ఇక అల్లు అర్జున్ ఇంటి చుట్టూ అవాంఛిత సంఘటనలు జరగకుండా తెల్లటి పరదాలను ఏర్పాటు చేశారు. ఆయన నివాసం వద్ద, బయటి వ్యక్తులకు లోపల కనిపించకుండా తెల్లటి గుడ్డలను ఇంటి చుట్టూ కట్టారు.