'సత్యం సుందరం' స్ట్రీమింగ్ డేట్‌ను రీషెడ్యూల్ చేసిన నెట్ ఫ్లిక్స్..!

తెలుగు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించిన కార్తీ ఎమోషనల్ డ్రామా సత్యం సుందరం త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది

By Medi Samrat  Published on  22 Oct 2024 8:45 PM IST
సత్యం సుందరం స్ట్రీమింగ్ డేట్‌ను రీషెడ్యూల్ చేసిన నెట్ ఫ్లిక్స్..!

తెలుగు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించిన కార్తీ ఎమోషనల్ డ్రామా సత్యం సుందరం త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ విడుదలకు సిద్ధమవుతోంది. సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలైంది. చాలా సింపుల్ కథతో, భావోద్వేగంతో తీసిన సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

కుటుంబం, సంబంధాలు, సొంత ఊరు, బాల్యంలోని ఆనందాలు, బంధువులు, నిజమైన స్నేహాలు లాంటి మనసును హత్తుకునే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. కార్తీ, అరవింద్ స్వామి నటనకు అధిక ప్రశంసలు దక్కాయి. చాలా మందికి కంటతడి పెట్టించింది ఈ సినిమా. ఓటీటీ రిలీజ్ ను మొదట దీపావళికి షెడ్యూల్ చేశారు. అయితే కాస్త ముందుగానే నెట్‌ఫ్లిక్స్‌లో చిత్రం డిజిటల్ రిలీజ్ అవ్వనుంది. అక్టోబర్ 25కి రీషెడ్యూల్ చేశారు. కుటుంబం, మానవ సంబంధాల గురించి హత్తుకునే సందేశంతో 'సత్యం సుందరం' ప్రపంచ ప్రేక్షకుల ప్రేమను పొందడం పక్కా.

Next Story