చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆ హీరో..!
Satya Dev to act with Chiranjeevi. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి తో నటించండం ఒక అద్భుత అవకాశంగా భావిస్తారు.
By Medi Samrat Published on 2 Jan 2021 1:19 PM ISTతెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి అంటే కేవలం సాధారణ అభిమానులు మాత్రమే కాకుండా,హీరోలు కూడా చిరంజీవి గారిని అభిమానిస్తుంటారు. అంతగా అభిమానించే హీరోతో కనీసం ఒక ఫోటో అయినా దిగాలని అభిమానులు ఆరాటపడుతుంటారు. అలాంటిది తన నటించే సినిమాలో నటించే అవకాశం వస్తుందంటే అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదని భావిస్తుంటారు. మెగాస్టార్ తో నటించే అవకాశం వస్తుందంటే హీరోలు సైతం ఆ అవకాశాన్ని వదులుకోరు... ప్రస్తుతం అలాంటి అవకాశమే చిరంజీవిని ఎంతగానో అభిమానించే ఒక టాలెంటెడ్ హీరోకి దక్కింది.
చిరంజీవి అభిమానిగా ఉంటూ తన సినిమాలో నటించే అవకాశాన్ని సంపాదించుకున్న ఆ హీరో.. ఎవరంటే సత్యదేవ్.ఇటీవల కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న సత్యదేవ్ మొదటి నుంచి మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో అభిమానం.గతేడాది చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకమైన డాన్స్ చేసి అందరిని ఆకట్టుకున్నారు. అంతేకాకుండా రెండు రోజుల క్రితం చిరంజీవితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఈ ఫోటోని షేర్ చేయకుండా 2020 సంవత్సరానికి గుడ్ బై చెప్పలేము అంటూ కామెంట్ చేశారు.
చిరంజీవి గారిని ఇంతగా అభిమానించే హీరో సత్యదేవ్ కి చిరంజీవి నటిస్తున్న సినిమాలు నటించే అవకాశం లభించింది. మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న లూసిఫర్ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రాన్ని రీమేక్ గా చిత్రీకరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంలోనే ఈ చిత్రంలో నటించడానికి ఓ పాత్రలో హీరో సత్యదేవ్ ను చిత్ర బృందం ఎంపికచేశారు.అసలేం చిరంజీవి అంటే ఎంతో అభిమానించే ఆ హీరోకు ఏకంగా తన సినిమాలో నటించే అవకాశం రావడంతో ఆ హీరో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఇందుకు సంబంధించిన ఈ విషయాన్ని త్వరలోనే చిత్రబృందం అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు. చిరంజీవి చేయబోతున్న ఈ సినిమాను ఎన్వీఆర్ సినిమాస్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.