బాడీ గార్డుల ఓవరాక్షన్.. క్షమాపణలు చెప్పిన నటి
Sara Ali Khan Says Sorry To Paparazzo Pushed By Her Security. బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ తన మంచి ప్రవర్తనతో మరోసారి హృదయాలను గెలుచుకుంది.
By Medi Samrat
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ తన మంచి ప్రవర్తనతో మరోసారి హృదయాలను గెలుచుకుంది. సోమవారం ముంబైలోని విలే పార్లేలోని మిథిబాయి కాలేజీలో జరిగిన కార్యక్రమంలో మీడియాకు చెందిన వ్యక్తులను తోసినందుకు తన బాడీగార్డ్ తరపున క్షమాపణలు చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. మిథిబాయి కాలేజీలో తన రాబోయే చిత్రం 'అత్రంగి రే' లోని పాట లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న నటి, తన బాడీగార్డుపై కోపం ప్రదర్శించడమే కాకుండా.. అతని తరపున "సారీ" అని చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. బాలీవుడ్ హంగామా షేర్ చేసిన వీడియోలో.. సారా అలీ ఖాన్ తన భద్రతా సిబ్బందితో నెట్టివేసిన ఫోటోగ్రాఫర్ గురించి అడగడం చూడవచ్చు.
"కిధార్ గయే వో? కిధర్ హైన్ వో? వో గిరయా కిస్కో ఆప్నే? (అతను ఎక్కడ ఉన్నాడు? మీరు ఎవరిని క్రిందికి నెట్టారు?)" ఆమె ఈవెంట్ తర్వాత తన కారులో వెళుతున్నప్పుడు ఆందోళనగా తన గార్డులను అడగడం చూడవచ్చు. ఒకరు నెట్టివేయబడ్డారని గుంపులో ఉన్న వ్యక్తులు చెప్పారు. సారా వెంటనే ప్రతిస్పందిస్తూ "నహీ నహీ, జిస్కో గిరయా థా వో చలే గయే (కాదు, కింద పడిన వ్యక్తి అప్పటికే వెళ్ళిపోయాడు)" మరియు ఇతర ఫోటోగ్రాఫర్‌ల వైపు తిరిగి, "ఉన్కో సారీ బోల్నా ప్లీజ్. ధన్యవాదాలు" అని తాను కూడా క్షమాపణ చెప్పింది. "ఆప్ నహీ కిజియే ఐసే. ఢక్కా మత్ దీజియే, కోయి బాత్ నహీ (ఇలా చేయవద్దు. ఎవరినీ నెట్టవద్దు, ఫర్వాలేదు)" మరియు మళ్లీ చెప్పింది. ఈవెంట్‌కు హాజరైన ఫోటోగ్రాఫర్లతో 'నన్ను క్షమించండి' అంటూ చెప్పేసి వెళ్ళిపోయింది. ఆమె చెప్పిన విధానం పట్ల ఎంతో మంది ఆనందాన్ని వ్యక్తం చేశారు.