సైడ్-బి వచ్చేస్తోంది.. ప్రియ-మను మళ్లీ కలుస్తారా.?

కన్నడ చిత్ర పరిశ్రమలోని ట్యాలెంటెడ్ నటులలో రక్షిత్ శెట్టి ఒకరు. అతడి సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తూ ఉంటారు.

By Medi Samrat  Published on  6 Dec 2023 6:30 PM IST
సైడ్-బి వచ్చేస్తోంది.. ప్రియ-మను మళ్లీ కలుస్తారా.?

కన్నడ చిత్ర పరిశ్రమలోని ట్యాలెంటెడ్ నటులలో రక్షిత్ శెట్టి ఒకరు. అతడి సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తూ ఉంటారు. ఇటీవలే అతడు నటించిన సప్తసాగరాలు దాటి- సైడ్ ఏ తెలుగులో విడుదలై ఒక్కరోజులోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ సప్తసాగరాలు దాటి- సైడ్ బి థియేటర్లలో సందడి చేస్తూ ఉంది. అయితే ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. స‌ప్త సాగ‌రాలు దాటి సైడ్ మూవీ డిసెంబ‌ర్ 15న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానుంది. క‌న్న‌డంతో పాటు తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో స‌ప్త‌సాగ‌రాలు దాటి సైడ్ బీ స్ట్రీమింగ్ కానుంది.

స‌ప్త‌సాగ‌రాలు దాటి సైడ్ ఏ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. సీక్వెల్‌ భారీ హిట్ అవ్వలేదు. స‌ప్త‌సాగ‌రాలు దాటి సైడ్ బీలో సినిమాలో ర‌క్షిత్ శెట్టి, రుక్మిణ్ వ‌సంత్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. హేమంత్ ఎం.రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. క‌న్న‌డంలో మంచి కలెక్షన్స్ సాధించింది. ముఖ్యంగా ఎమోషనల్ డ్రామా కావడంతో అందరికీ కనెక్ట్ అవ్వడం కష్టమే.. కానీ ప్రియ-మను క్యారెక్టర్స్ కనెక్ట్ అయితే మాత్రం సినిమా తప్పకుండా నచ్చుతుంది.

Next Story