సంక్రాంతి సినిమాలు బ్రేక్ ఈవెన్ సాధించాలంటే..?

సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాల ప్రీ-రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ వివరాలు బయటకు వచ్చాయి.

By Medi Samrat  Published on  6 Jan 2024 8:30 PM IST
సంక్రాంతి సినిమాలు బ్రేక్ ఈవెన్ సాధించాలంటే..?

సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాల ప్రీ-రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ వివరాలు బయటకు వచ్చాయి. మహేష్ బాబు గుంటూరు కారం, హనుమాన్, వెంకటేష్ సైంధవ్, నాగార్జున యొక్క నా సామి రంగ సినిమాలు సంక్రాంతికి విడుదల అవుతూ ఉన్నాయి. త్రివిక్రమ్- మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమా 135 కోట్ల బిజినెస్ చేసింది. వెంకటేష్ సైంధవ్ సినిమా, తేజ సజ్జ హనుమాన్ సినిమాలకు తెలుగు రాష్ట్రాలలో 25 కోట్ల బ్రేక్-ఈవెన్ మార్క్ గా చెబుతున్నారు. ఇక 'నా సామి రంగ' సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ మార్క్ 18 కోట్లుగా చెబుతున్నారు.

అన్ని సినిమాలు తమ బడ్జెట్‌లకు తగ్గట్టుగా మంచి బిజినెస్ చేశాయి. ప్రతి సినిమా సేఫ్ పొజిషన్‌లో ఉంది. అన్ని సినిమాల నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా ఇప్పటికే పూర్తీ అవ్వడంతో.. నిర్మాతలందరూ కంఫర్టబుల్ జోన్‌లో ఉన్నారు. హిట్ టాక్ వస్తే సంక్రాంతి సీజన్ లో నిర్మాతలందరూ మంచి ప్రాఫిట్స్ ను అందుకోనున్నారు.

Next Story