‘అర్జున్ రెడ్డి’, 'అనిమల్' సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ‘తండేల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. 'ప్రేమమ్' సినిమా నుండి సాయి పల్లవికి తాను అభిమానినని, ఆమెను 'అర్జున్ రెడ్డి' సినిమాలో యాక్ట్ చేయించాలని భావించినట్లు సందీప్ రెడ్డి తెలిపారు. అయితే, ఆమె రొమాంటిక్ చిత్రాలను చేయడానికి ఎక్కువగా ఇష్టపడదని కోఆర్డినేటర్ ద్వారా తనకి సమాచారం వచ్చిందని సందీప్ రెడ్డి తెలిపారు. సినిమాల ఎంపికలో ఆమె వైఖరి మారుతుందని తాను అనుకున్నానని కానీ ఆమె తన ఎంపికను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోకపోవడం అసాధారణమైనదని సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు కురిపించారు.
సాయి పల్లవి ఈ విషయంపై స్పందించింది. సినిమాలో తనను తీసుకోవాలని అనుకున్నారనే విషయం గురించి తనకు తెలియదని, ఆ అవకాశం తన దాకా ఎప్పుడూ రాలేదని తెలిపింది. విజయ్ దేవరకొండ, షాలిని పాండే తమ పాత్రలకు సరిగ్గా సరిపోయారని, కల్ట్ ఫిల్మ్ గా 'అర్జున్ రెడ్డి' నిలిచిందని సాయి పల్లవి చెప్పడం విశేషం.