హీరో సందీప్ కిషన్ 'మైఖేల్' టీజర్ డేట్ లాక్.. రిలీజ్ ఎప్పుడంటే?

Sandeep Kishan Michael teaser date locked. రంజిత్ జయకోడి దర్శకత్వంలో వెర్సటైల్ స్టార్ సందీప్ కిషన్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం

By అంజి  Published on  14 Oct 2022 7:21 AM GMT
హీరో సందీప్ కిషన్ మైఖేల్ టీజర్ డేట్ లాక్.. రిలీజ్ ఎప్పుడంటే?

రంజిత్ జయకోడి దర్శకత్వంలో వెర్సటైల్ స్టార్ సందీప్ కిషన్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం 'మైఖేల్'. ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కింది. ఇందులో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రత్యేక యాక్షన్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ ఏడాది మేలో సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్‌ చేశారు. సందీప్‌ లుక్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా టీజర్‌కి సంబంధించిన అప్‌డేట్‌ని అందజేసారు మేకర్స్. టీజర్‌ అక్టోబర్ 20న విడుదల కానుంది.

టీజర్‌ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో సందీప్ దివ్యాంశ కౌశిక్ లిప్‌ కిస్‌ పెట్టడం కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లో ఎగిరే పక్షులతో పోస్టర్ చాలా రొమాంటిక్ గా ఉంది. సినిమాలో యాక్షన్‌తో పాటు రొమాన్స్ కూడా ఉంటుందని, ఈ పోస్టర్ అదే విషయాన్ని తెలియజేస్తోంది. ఈ సినిమాలో స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పితో కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. వచ్చే ఏడాది తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.


Next Story