గుండెపోటుతో ప్ర‌ముఖ న‌టుడి భార్య హ‌ఠాన్మ‌ర‌ణం

Sandalwood Actor Vijay Raghavendra Wife Spandana Passes Away Due To Heart Attack. కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన రాఘవేంద్ర గుండెపోటుతో కన్నుమూశారు.

By Medi Samrat  Published on  7 Aug 2023 4:44 PM IST
గుండెపోటుతో ప్ర‌ముఖ న‌టుడి భార్య హ‌ఠాన్మ‌ర‌ణం

కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన రాఘవేంద్ర గుండెపోటుతో కన్నుమూశారు. ఇద్దరూ థాయ్‌లాండ్‌లో ఉండ‌గా ఈ ఘటన జరిగింది. మీడియా నివేదికల ప్రకారం.. విజయ్ రాఘవేంద్ర భార్యకు తక్కువ రక్తపోటు ఉందని, దాని కారణంగా ఆమెకు గుండెపోటు వచ్చింది.

మీడియా నివేదికల ప్రకారం.. విజయ్ రాఘవేంద్ర భార్యకు లో బీపీ ఉందని.. దాని కారణంగా ఆమెకు గుండెపోటు వచ్చిందని తెలుస్తోంది. స్పందన పార్థివదేహం రేపు బెంగళూరుకు చేరుకుంటుందని.. అక్కడ లాంఛనాలు పూర్తవుతాయని భావిస్తున్నారు.

స్పందన బ్యాంకాక్‌లో మరణించిన కారణంగా.. ఆమె మృతదేహం ఇండియా తీసుకురావ‌డానికి సమయం పడుతుంది. రేపు అంటే మంగళవారం ఆయన భౌతికకాయం బెంగళూరుకు చేరుకుంటుందని చెబుతున్నారు. విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన కుటుంబం విహార‌యాత్ర‌కు బ్యాంకాక్ వెళ్లినట్లు సమాచారం. స్పందన ఆకస్మిక మరణంతో కుటుంబం షాక్‌లో ఉంది.

నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన కూడా సినిమాల్లో పనిచేసింది. ఆమె అతిధి పాత్రలో కనిపించింది. రవిచంద్రన్ సినిమా ‘అపూర్వ’లో ఆమె అతిథి పాత్రలో కనిపించారు. రాఘవేంద్ర, భార్య స్పందన ఈ నెల 16వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నారు. ఇద్దరికీ 2007 సంవత్సరంలో వివాహం జరిగింది. ఇద్దరికీ శౌర్య అనే కుమారుడు ఉన్నాడు. 'చిన్నారి ముత్తా'లో నటుడు విజయ్ రాఘవేంద్ర పాత్ర విశేష ప్ర‌జాద‌ర‌ణ పొందింది. ఈ చిత్రానికి విజయ్ రాఘవేంద్ర జాతీయ అవార్డును కూడా అందుకున్నారు.

Next Story