జాతీయ ఉత్తమ నటుడు సంచారి విజయ్ కన్నుమూత
Sanchari Vijay no more. కన్నడ నటుడు విజయ్ సంచారి కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విజయ్
By Medi Samrat Published on 14 Jun 2021 1:58 PM ISTకన్నడ నటుడు విజయ్ సంచారి కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విజయ్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) లో చికిత్స పొందూతూ తుదిశ్వాస విడిచారు. జూన్ 12, శనివారం బైక్ పై తన స్నేహితుడి దగ్గర నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు విజయ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. విజయ్ మెదడు యొక్క కుడి భాగం, తొడ ప్రాంతంలో గాయాలైనట్లు సమాచారం. తీవ్రంగా గాయపడ్డ విజయ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ కన్నుమూశారు. విజయ్‌ది బ్రెయిన్ డెడ్‌గా వైద్యులు ధృవికరించారని, ఆయన అవయవాలను దానం చేయాలనుకుంటున్నట్లు ఆయన సోదరుడు సిద్దేశ్ వెల్లడించారు. కాగా విజయ్ మృతితో కన్నడ సినీ పరిశ్రమంలో విషాదం చోటుచేసుకుంది.
విజయ్‌కు చికిత్స చేసిన న్యూరో సర్జన్ అరుణ్ నాయక్.. నిన్న మీడియాతో మాట్లాడుతూ.. విజయ్ పరిస్థితి క్రిటికల్ గా ఉందని అన్నారు. అతనికి మెదడులో రక్తం గడ్డకట్టిందని.. శస్త్రచికిత్స చేశామని తెలిపారు. రాబోయే 48 గంటలు గడిస్తే కానీ చెప్పలేమని అని అన్నారు. కాగా., పరిస్థితి విషమించి సోమవారం కన్నుమూశారు.
విజయ్ సంచారి 2011 లో 'రంగప్ప హోగ్బిటనా' అనే సినిమా ద్వారా అరంగేట్రం చేసాడు. దాసవాలా, హరివు, ఒగ్గారనే, కిల్లింగ్ వీరప్పన్, వర్తమాన, సిపాయ్ లాంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించారు. 'నాను అవనాల్లా అవలు' చిత్రంతో జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. రాక్‌స్టార్ యశ్, సుదీప్‌తో పాటు పలువురు స్టార్ హీరోలు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు.