'యశోద' టీజర్‌ రిలీజ్‌.. పీక్స్‌లో సామ్‌ యాక్టింగ్‌

Samantha "Yashoda" Movie Teaser Released. సమంతా రూత్ ప్రభు టైటిల్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'యశోద'. గణేష్‌ నిమజ్జనం సందర్భంగా.. తాజాగా ఈ సినిమా

By అంజి  Published on  9 Sept 2022 11:14 AM IST
యశోద టీజర్‌ రిలీజ్‌.. పీక్స్‌లో సామ్‌ యాక్టింగ్‌

సమంతా రూత్ ప్రభు టైటిల్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'యశోద'. గణేష్‌ నిమజ్జనం సందర్భంగా.. తాజాగా ఈ సినిమా నుంచి బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ మూవీ టీజర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోంది. ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హరి–హరీష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవీ మూవీస్ బ్యానర్ పై శివ‌లెంక కృష్ణ ప్రసాద్ పిక్చర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. తాజా టీజర్‌లో సమంత.. ఓ పావురాన్ని పట్టుకుంటూ కనిపించింది. ఈ సీన్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

అలాగే ఈ టీజర్‌లో సమంత యాక్టింగ్‌ కూడా పీక్‌ లో ఉంది. టీజర్‌ చూస్తుంటే.. సినిమా మొత్తం క్రైమ్‌ థ్రిల్లర్‌గా కొనసాగనుందని తెలుస్తోంది. టీజర్‌లో సమంత గర్భవతి పాత్రలో కనిపించింది. డాక్టర్ సమంతను గర్భవతిగా ఉన్నప్పుడు ఏ ఏ పనులైతే చేయదని చెప్తుందో సమంత అలాంటి పనులే చేస్తుంది. ఆమెను ఎవరో చంపడానికి ప్రయత్నించడం.. వాళ్ళ నుంచి సామ్ తప్పించుకోవడం.. విలన్స్ తో పోరాడటం ఈ టీజర్‌లో చూపించారు. ఈ సినిమా నిజమైన క్రైమ్ సంఘటన ఆధారంగా రూపొందించబడింది.

తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఆగస్ట్ 12న థియేటర్లలోకి రావాల్సి ఉండగా వాయిదా పడింది. త్వరలో తాజా విడుదల తేదీని ప్రకటించనున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటిస్తున్న మరో చిత్రం 'శాకుంతలం' 2023 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ సినిమాకి మణి శర్మ సంగీతం అందిస్తుండగా, ఎం. సుకుమార్ కెమెరా హ్యాండిల్ చేశారు. సినిమాలో రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పిక గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ,ఇతరులు సహాయక పాత్రల్లో నటించారు.


Next Story