అలా చేయడం నా వల్ల కాలేదు : సమంత
Samantha Shares Shaakuntalam Movie Shooting Experience. సమంత రూత్ ప్రభు నటిస్తున్న 'శాకుంతలం' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
By Medi Samrat Published on 8 Jan 2023 7:42 PM ISTసమంత రూత్ ప్రభు నటిస్తున్న 'శాకుంతలం' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దేవ్ మోహన్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ట్రైలర్ జనవరి 9 మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. సమంత ఈ సినిమా షూటింగ్‌లో అత్యంత కష్టతరమైన భాగం గురించి పోస్ట్ చేసింది. అయితే ఆమె బాధపడుతున్న మైయోసిటిస్ తో దీనికి ఎటువంటి సంబంధం లేదు.
శాకుంతలం చిత్రంలో కష్టమైన అంశం ఏమిటంటే.. నడుస్తున్నప్పుడు.. మాట్లాడుతున్నప్పుడు.. పరుగెత్తున్నప్పుడు.. ఏడుస్తున్నప్పుడు భంగిమను కొనసాగించడం. అలా చేయడం నా వల్ల కాలేదు. దాని కోసం ట్రైనింగ్ తీసువాల్సి వచ్చింది. అలా కాకుండా సాషా(పెంపుడు కుక్క)ను కూడా వెంట తీసుకెళ్లి ఉండాల్సింది' అంటూ దీనంగా చూస్తున్న పెంపుడు కుక్క వీడియో పాటు శాకుంతలం భంగిమను షేర్ చేసింది సమంత.
("The toughest part of #Shakuntalam was maintaining grace and posture while walking, talking, running… even crying! And grace is sooo not my thing. Had to take training sessions for it! Should have taken Sasha along… clearly so not her thing either! #LikeMotherLikeDaughter (sic)") అంటూ పోస్టు పెట్టింది సమంత. గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.