ఈ జనరేషన్‌ మహానటి ఎవరో చెప్పిన దిగ్గ‌జ‌ నిర్మాత‌లు

Samantha Ruth Prabhu reacts as producers Suresh Babu and Allu Aravind call her 'next Mahanati'. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న ‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌-2’ లో పలువురు సందడి చేస్తూ ఉన్నారు.

By Medi Samrat  Published on  3 Dec 2022 4:00 PM GMT
ఈ జనరేషన్‌ మహానటి ఎవరో చెప్పిన దిగ్గ‌జ‌ నిర్మాత‌లు
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న 'అన్‌స్టాపబుల్‌ సీజన్‌-2' లో పలువురు సందడి చేస్తూ ఉన్నారు. మొదటి ఎపిసోడ్ లోనే నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తో మొదలుపెట్టిన బాలయ్య ఒక ఎపిసోడ్ కు యంగ్ జనరేషన్, మరో ఎపిసోడ్ కు చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజాలతో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక సినీ ప్రముఖుల నుండి రాజకీయ నాయకుల వరకు అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ బాలయ్య అందరిలోనూ జోష్ నింపుతూ వెళుతున్నాడు.

తాజా ఎపిసోడ్ లో సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌కు బాలకృష్ణ పలు ప్రశ్నలు వేశారు. 'ఈ జనరేషన్‌ హీరోయిన్లలో మహానటి స్థాయికి వెళ్లగలిగే తార ఎవరని మీరు అనుకుంటున్నారు..?' అని అడగ్గా.. 'సమంత' అని ఇద్దరూ సమాధానమిచ్చారు. ఒక స్లేట్ పైన.. సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌ సమంత పేరు రాయడం విశేషం. 'ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో అవ్వగలిగితే ఆ అమ్మాయి (సమంత) ఒక్కటే ఆ స్థాయికి వెళ్లగలదు' అంటూ సురేశ్‌బాబు చెప్పుకొచ్చారు. ఈ వీడియోపై తాజాగా సమంత స్పందించింది. వీడియో క్లిప్‌ను రీట్వీట్‌ చేస్తూ.. లవ్‌ సింబల్‌ను జత చేసింది. సమంత నటించిన యశోద సినిమా ఇటీవల మంచి కలెక్షన్స్ ను రాబట్టిన సంగతి తెలిసిందే..!


Next Story