సమంత ప్రత్యేక పూజలు.. మెట్టు మెట్టుకి హారతి వెలిగిస్తూ..

Samantha Ruth Prabhu climbs 600 steps barefoot to seek blessing at Pazhani temple. సినీ నటి సమంత తమిళనాడులోని పళనిలో ఉన్న ప్రముఖ సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని

By Medi Samrat
Published on : 14 Feb 2023 7:02 PM IST

సమంత ప్రత్యేక పూజలు.. మెట్టు మెట్టుకి హారతి వెలిగిస్తూ..

సినీ నటి సమంత తమిళనాడులోని పళనిలో ఉన్న ప్రముఖ సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోకి వెళ్లాలంటే సుమారు 600లకు పైగా మెట్లు ఎక్కి వెళ్లాలి. సమంత మెట్టు మెట్టుకు కర్పూరం వెలిగిస్తూ భక్తితో ఆలయానికి చేరుకుని స్వామిని దర్శించుకోవడం విశేషం. సమంత సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సమంత ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ శాకుంతలం ఏప్రిల్ 14న ఐదు భాషల్లో విడుదల కానుంది. శాకుంతలం మూవీని త్రీడీ టెక్నాలజీలో చేస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని ముందుగా ఫిబ్రవరి 17న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన సినిమా వాయిదా పడింది. ఇందులో సమంత శకుంత‌ల‌గా కనిపించనుండగా.. దుష్యంతుడిగా దేవ్ మోహ‌న్ న‌టించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు స‌మర్పణ‌లో శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్, గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై నీలిమ గుణ నిర్మించారు.


Next Story