నన్ను సెకండ్‌ హ్యాండ్‌ అన్నారు: సమంత

టాలీవుడ్‌ హీరో నాగచైతన్యతో విడాకులు ప్రకటించిన సమయంలో కొందరు తనను సెకండ్‌ హ్యాండ్‌, యూస్‌డ్‌ అని కామెంట్‌ చేశారని సమంత ఆవేదన వ్యక్తం చేశారు.

By అంజి  Published on  26 Nov 2024 11:42 AM IST
Samantha, divorce, Tollywood

నన్ను సెకండ్‌ హ్యాండ్‌ అన్నారు: సమంత

టాలీవుడ్‌ హీరో నాగచైతన్యతో విడాకులు ప్రకటించిన సమయంలో కొందరు తనను సెకండ్‌ హ్యాండ్‌, యూస్‌డ్‌ అని కామెంట్‌ చేశారని సమంత ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటే ఫెయిల్యూర్‌గా పరిగణిస్తారు, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం మహిళలు, వారి కుటుంబాలకు కష్టంగా ఉంటుందని సమంత అన్నారు. తనపై చాలా రూమర్స్‌ వచ్చాయని, అవి నిజం కాదని చాలా సార్లు చెప్పాలనిపించిందని, కానీ చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదని ఆగిపోయా అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. విడాకుల సమయంలో తాను ఎదుర్కొన్న ట్రోలింగ్‌ గురించి మాట్లాడారు.

డివోర్స్‌ తీసుకున్న తర్వాత అమ్మాయిలకు కొన్ని ట్యాగ్స్‌ తగిలిస్తారని అసహనం వ్యక్తం చేశారు. అవి తనను ఎంతో బాధించాయని వెల్లడించారు. ఇద్దరి మధ్య సంబంధం విచ్ఛిన్నమైతే అమ్మాయిలనే నిందిస్తారని, దురదృష్టవశాత్తూ మనం అలాంటి సమాజంలో బతుకుతున్నామని సమంత అన్నారు. తన పెళ్లి గౌనును రీ డిజైన్‌ చేయడం ద్వారా తాను ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించలేదని అన్నారు. ఎన్నో కష్టమైన దశలు దాటుకుని వచ్చానంటే అది బలానికి ప్రతీక అని చెప్పారు. ప్రస్తుతం తాను చాలా హ్యాపీగా ఉన్నానని సమంత తెలిపారు. కాగా 2017లో నాగచైతన్య - సమంత పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. వ్యక్తిగత కారణాల రీత్యా 2021లో వీరిద్దరూ విడిపోయారు.

Next Story