హీరోయిన్ సమంతకు స్వల్ప అస్వస్థత
Samantha falls sick and tested hospital. ప్రముఖ హీరోయిన్ సమంత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె హైదరాబాద్‌లోని ఎఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆస్పత్రిలో పలు
By అంజి Published on 13 Dec 2021 2:55 PM ISTప్రముఖ హీరోయిన్ సమంత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె హైదరాబాద్‌లోని ఎఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆస్పత్రిలో పలు టెస్టులు చేయించుకుని వెళ్లింది. రిపోర్ట్స్ రావాల్సి ఉంది. సమంత గత కొన్ని రోజులుగా తిరుపతి, శ్రీకాళహస్తి, కడపతో పాటు పలు ప్రాంతాల్లో పర్యటించారు. పర్యటన అనంతనం సమంత నిన్న హైదరాబాద్‌కుక చేరుకున్నారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆమె అస్వస్థతకు గురయ్యారు. సమంత తీవ్రమైన జలుబు, వైరల్ జ్వరంతో ఇబ్బందిపడుతున్నట్లు తెలిస్తోంది. అయితే సమంత పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని.. ఆమె మేనేజర్ మహేంద్ర తెలిపారు.
నిన్న కొంచెం దగ్గు ఉండటంతో ఎఐజీ హాస్పిటల్లో టెస్ట్ చేయించుకుని తన ఇంట్లో సమంత రెస్ట్ తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మవద్దని సమంత మేనేజర్ మహేంద్ర కోరారు. ఆదివారం కడపలో హీరోయిన్ సమంత సందడి చేశారు. కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కొత్త నిర్మించిన మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా వచ్చారు. దీంతో అక్కడికి హీరోయిన్ సమంతను చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. ఇక అక్కడి వచ్చిన అభిమానులంతా సమంతతో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. కాగా షాపింగ్ మాల్ ప్రారంభం అనంతరం ఆమె ఫ్యాన్స్‌కు అభివాదం చేసింది.
ఇక ఇటీవలే అల్లు అర్జున్ నటించిన "పుష్ప" సినిమాలో ఈ భామ ఐటెం సాంగ్ చేసింది. దీనికి సంబంధించిన లిరికల్ వీడియో కూడా ఇప్పుడు విడుదలైంది. అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఆమె మొదటి సారిగా పుష్ప సినిమాలో ఐటెం సాంగ్‌లో డ్యాన్స్ చేశారు. కాగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.