అప్పటివరకు మా స్నేహం ఇలాగే ఉంటుందన్న సమంత!
Samantha About Her Friends. టాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో ఒకరైన సమంత_ నాగ చైతన్య ఇద్దరూ కలిసి కొత్త సంవత్సరం వేడుకలను గోవా లో వారి ఫ్రెండ్స్ తో జరుపుకున్నారు
By Medi Samrat Published on 1 Jan 2021 6:24 PM ISTటాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో ఒకరైన సమంత_ నాగ చైతన్య ఇద్దరూ కలిసి కొత్త సంవత్సరం వేడుకలలో భాగంగా గోవా వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ జోడి వారి స్నేహితులైన సమంత డిజైనర్, బెస్ట్ ఫ్రెండ్స్ శిల్పా రెడ్డి, హర్ష రెడ్డి, ప్రీతం రెడ్డిలతో కలిసి డిసెంబర్ 29న గోవా వెళ్లారు. చైతన్య సమంత దంపతులు, స్నేహితులందరూ కలిసి గోవాలో సందడి చేస్తున్నారు.వీరి న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించిన ఫోటోలను సమంత గురువారం సోషల్ మీడియా వేదికగా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటోను తన అభిమానులతో పంచుకుంటూ, ఈ ఫోటోకు"వృద్ధాప్యం వరకు మేమంతా మంచి స్నేహితులమే"అంటూ సమంత తన ఇన్స్టాగ్రామ్ ద్వారాపోస్ట్ చేస్తూ గత నాలుగు సంవత్సరాల క్రితం ఇదే స్నేహితులతో కలిసి దిగిన ఫోటోను కూడా తన పోస్టుకు ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక సినిమాల విషయానికి వస్తే నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో "లవ్ స్టోరీ" సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలి నాగ చైతన్యతో సాయి పల్లవి జతకట్టారు. ఇప్పటికే ఈ చిత్ర నిర్మాణం పూర్తయింది. ఇక సమంత విషయానికొస్తే "ఆహా" యాప్ ద్వారా ప్రసారం అయ్యే "సామ్ జామ్" అనే టాక్ షోకి వ్యాఖ్యాతగా నిర్వహిస్తూ, మరోవైపు విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కాతువాకుల రేండు కాదల్' సినిమాలో నటిస్తున్నారు. ఇందులో సమంత విజయ్ సేతుపతికి జోడి కట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించారు. అంతేకాకుండా ఈ సినిమాలో నయనతార కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాలను తొందరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయని చిత్రబృందం తెలిపారు.