క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టుకుని దోశ‌లేసిన చిరంజీవి.. వీడియో వైర‌ల్‌

Sam Jam Mega Promo. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో స‌మంత ఒక‌రు. ఆహా ఓటీటీలో నిర్వ‌హిస్తోన్న సామ్‌జామ్ ప్రోగామ్‌కి

By Medi Samrat  Published on  22 Dec 2020 1:46 PM IST
క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టుకుని దోశ‌లేసిన చిరంజీవి.. వీడియో వైర‌ల్‌

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో స‌మంత ఒక‌రు. ఆహా ఓటీటీలో నిర్వ‌హిస్తోన్న సామ్‌జామ్ ప్రోగామ్‌కి ఆమె వ్యాఖ్యత‌గా కొన‌సాగుతున్నారు. ఇప్ప‌టికే ఈ షో అభిమానుల‌ను అల‌రించింది. ఇక ఈ కార్య‌క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ క్రిస్మ‌స్ కానుక‌గా ప్ర‌సారం కానుంది. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన మ‌రో ప్రోమోను విడుద‌ల చేశారు.

ఇందులో స‌మంత అడిగిన ప్ర‌శ్న‌ల‌కు చిరంజీవి చాలా స‌ర‌దాగా స‌మాధానాలు ఇచ్చారు. మీరు ఎప్పుడైనా సినిమా చూస్తూ ఏడ్చేశారా..? అని స‌మంతం ప్ర‌శ్నించ‌గా.. తాను గతంలో ఓ సినిమాకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నానని, కిందకు వంగి కన్నీరు తుడుస్తున్న సమయంలో లైట్స్‌ వేశారని సరదాగా చెప్పారు. ఆ సమయంలో తాను పైకి లేచేసరికి ఓ పైట తన చేతిలో ఉందని అన్నారు. చేతులు లేని ఓ బాలుడు వేదిక‌పైనే చిరు పెయింట్ వేయ‌డంతో.. ఆనందంతో చిరు ఆ బాలుడిని మెచ్చుకున్నారు. చిరుకి వైవా హర్ష ఓ ప్రశ్న వేశాడు. ఒకవేళ మీ సినిమాలను రీమేక్ చేయాలంటే మీ పాత్రలను ఎవరు చేయగలరని అడుగ‌గా.. చరణ్, తారక్, బన్నీ, రవితేజ, ప్రభాస్, విజయ్ దేవరకొండ, మహేశ్, పవన్ కల్యాణ్ అని స‌మాధానం ఇచ్చారు.

గతంలో చిరంజీవి దోశ ఛాలెంజ్‌ లో పాల్గొన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన ఫేవరేట్ దోశ ఛాలెంజ్ లో మరోసారి పాల్గొనాలని సమంత అడిగింది. దీంతో ఆయన కళ్లకు గంతలు కట్టుకుని దోశ ఛాలెంజ్‌ను చేసి చూపించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.





Next Story