రౌడీతో కిస్సులకు ఓకే చెప్పిన త‌మ‌న్నా.. వీడియో వైర‌ల్‌

Sam Jam Episode 4 Glimpse. టాలీవుడ్ టాప్ హీరోయిన్ల‌లో అక్కినేని వారి కోడ‌లు స‌మంత ఒక‌రు.

By Medi Samrat  Published on  11 Dec 2020 8:31 AM GMT
రౌడీతో కిస్సులకు ఓకే చెప్పిన త‌మ‌న్నా.. వీడియో వైర‌ల్‌

టాలీవుడ్ టాప్ హీరోయిన్ల‌లో అక్కినేని వారి కోడ‌లు స‌మంత ఒక‌రు. ఆహా వేదిక‌గా స‌మంత వ్యాఖ్య‌త‌గా సామ్ జామ్ కార్య‌క్ర‌మాన్ని చేస్తోంది. టాప్ సెల‌బ్రెటీల‌తో సామ్ చేస్తున్న‌ ఇంట‌ర్వ్యూలు హైలెట్ అవుతున్నాయి. తాజాగా ఈ కార్య‌క్ర‌మంలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా పాల్గొంది. ఆమెను సమంత పలు ప్రశ్నలు అడిగింది.

నో కిస్సింగ్‌ ఆన్‌స్క్రీన్‌ నిబంధనను‌ తీసేస్తే ఎవర్ని ముద్దు పెట్టుకుంటావని తమన్నాను అడుగ‌గా.. విజ‌య్ దేవ‌ర‌కొండ అని ఓపెన్‌గానే చెప్పేసింది. కాగా తన మనసు ఎప్పుడైనా గాయపడితే.. ఒక్కోసారి తాను రచయిత్రిగా మారుతానని పద్యాలు రాస్తానని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. దీంతో 'ఎంత ధైర్యం నీ గుండెను గాయపరిచిందో ఎవరో చెప్పు నేను చూసుకుంటా' అని సమంత సరదాగా చెప్పింది. అఖిల్ కొంచెం యంగ్ అయిపోయాడు కానీ! అంటూ సమంత సముదాయిస్తుంటే... లవ్ కి ఏజ్‌తో సంబంధం లేదు అంటూ జోష్ చూపించింది తమన్నా.

నీక్కావాలంటే అఖిల్తో మీటింగ్ అరేంజ్ చేస్తా అంటూ సామ్ కవ్వించింది. అంతేకాదు.. అఖిల్ ఫాదర్ తో కూడా మాట్లాడతాన‌ని సమంత సరదాగా చెప్పింది. తాజా ప్రోమోలో నందిని రెడ్డి కనిపించారు. ఇక తమన్నాకు స్టంట్స్ నేర్పిస్తున్న కోమల్ షాలినిలకు చెరో లక్ష చెక్ ని అందజేయడం విశేషం. ప్ర‌స్తుతం ప్రోమో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. తమన్నా ప్రస్తుతం సీటీమార్ సహా పలు చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 సీజన్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది.Next Story