ఏ మాత్రం సత్తా చాట లేకపోయిన సల్మాన్ ఖాన్

Salman Khan's film fails to beat past Eid release records. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సినిమా 'కిసీ కా భాయ్ కిసి కీ జాన్’. పూజ హెగ్డే, వెంకటేష్, భూమిక..

By M.S.R  Published on  22 April 2023 11:52 AM IST
ఏ మాత్రం సత్తా చాట లేకపోయిన సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సినిమా 'కిసీ కా భాయ్ కిసి కీ జాన్’. పూజ హెగ్డే, వెంకటేష్, భూమిక.. ఇలా భారీ తారాగణంతో అత్యంత భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా 5700 స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమాకు పేలవమైన ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ అనలిస్టులు చెబుతూ ఉన్నారు. సాధారణంగా సల్మాన్ ఖాన్ ఈద్ రిలీజ్ లకు ఊహించని ఓపెనింగ్ కలెక్షన్స్ ఉంటాయి. కానీ ఈ సినిమాకు సల్మాన్ గత సినిమాలకంటే అతి తక్కువ ఆక్యుపెన్సీ లభించింది. తొలి రోజు కలెక్షన్స్ రూ. 15 కోట్లు కూడా మించలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

గతంలో రంజాన్ సందర్భంగా విడుదలైన సల్మాన్ చిత్రాలు మంచి కలెక్షన్స్ ను రాబట్టాయి. దబాంగ్ 3 తొలిరోజు రూ.24.50 కోట్లు వసూలు చేసింది. రేస్ 3 రూ.28.50 కోట్లు రాబట్టింది. బజరంగీ భాయిజాన్ రూ. 27.25 కోట్లు రాబట్టి సల్మాన్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కిసీ కా భాయ్ కిసీ కి జాన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమాకు ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించారు. ఇందులో సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే, వెంకటేష్ నటించారు. ఏంటమ్మా సినిమాలో రామ్ చరణ్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చాడు.


Next Story