Falling in Love Song : సల్మాన్‌, పూజా హెగ్డేల ఆ పాట‌కు ప‌డిపోవాల్సిందే..!

Salman Khans Falling In Love Song Out. సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్న 'కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌' సినిమా కోసం అభిమానులు

By Medi Samrat  Published on  21 March 2023 4:27 PM IST
Falling in Love Song : సల్మాన్‌, పూజా హెగ్డేల ఆ పాట‌కు ప‌డిపోవాల్సిందే..!

సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్న 'కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌' సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షారుక్ ‘పఠాన్‌’తో పాటు విడుదలైన ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రంలోని కొత్త పాటను విడుదల చేశారు యూనిట్‌. సల్మాన్ ఖాన్ నిన్న‌ 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'లోని 'రాహే ది హమ్' ('ఫాలింగ్ ఇన్ లవ్') పాటకు సంబంధించిన అప్‌డేట్‌ను ఇచ్చారు. పాట టీజర్‌ను పంచుకుంటూ.. 'ఫాలింగ్ ఇన్ లవ్' మార్చి 21న విడుదలవుతున్నట్లు తెలిపారు. ఈ రోజు స‌ల్మాన్‌ పాటను విడుదల చేశారు.


సల్మాన్ ఖాన్, పూజా హెగ్డేల ప్రేమకథను ఈ పాటలో చిత్రీకరించారు. 'ఫాలింగ్ ఇన్ లవ్'లో ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. భాయిజాన్ ఈ పాటలో డిఫరెంట్ లుక్‌లో కనిపించాడు.. ఆ లుక్ అంద‌రి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' విడుదల తేదీని ఇప్పటికు ప‌లుమార్లు మార్చారు. ఈ సినిమా 2022లో విడుదల అవుతుందని అభిమానులు భావించారు. కానీ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' రిలీజ్ డేట్ వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ప్రకారం.. ఈ ఏడాది ఈద్ సందర్భంగా సినిమా రానుంది. 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' ని సల్మాన్ ఖాన్ ఏప్రిల్ 21న విడుదల చేస్తున్నారు.


Next Story