మాజీ ప్రియురాలిని ముద్దు పెట్టుకున్న సల్మాన్.. ఫోటోలు వైరల్

Salman Khan kisses ex-girlfriend Sangeeta Bijlani on forehead at his birthday bash. సల్మాన్ ఖాన్ తన 57వ పుట్టినరోజును డిసెంబర్ 27 అర్ధరాత్రి ముంబైలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో

By M.S.R
Published on : 27 Dec 2022 9:15 PM IST

మాజీ ప్రియురాలిని ముద్దు పెట్టుకున్న సల్మాన్.. ఫోటోలు వైరల్

సల్మాన్ ఖాన్ తన 57వ పుట్టినరోజును డిసెంబర్ 27 అర్ధరాత్రి ముంబైలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు. షారుఖ్ ఖాన్ కూడా బర్త్ డే బాష్‌కు హాజరయ్యాడు. సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి సంగీతా బిజ్లానీతో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సల్మాన్ ఖాన్ సంగీతను కౌగిలించుకున్నాడు. సల్మాన్ ఆమె నుదిటిపై ముద్దు పెట్టడం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 90వ దశకంలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.. నిశ్చితార్థం కూడా చేసుకోబోతున్నారనే ప్రచారం నడిచింది.. కానీ కొంతకాలం తర్వాత విడిపోయారు. సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకూ పెళ్లి చేసుకోలేదు. పలువురితో అఫైర్స్ నడిచాయనే ప్రచారం మాత్రం బాగా నడిచింది.

సల్మాన్ ఖాన్ కు ఈ ఏడాదికి 57 ఏళ్లు. సల్మాన్ తన పుట్టినరోజును అతని సన్నిహితులతో మాత్రమే జరుపుకుంటూ ఉంటాడు. షారుఖ్ ఖాన్, అర్పిత, ఆయుష్ శర్మ ఈవెంట్ కు హాజరయ్యారు.


Next Story