ఏమాత్రం భయపడని సల్మాన్ ఖాన్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల కలకలం జరగడం దేశ ప్రజలను షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే.

By Medi Samrat
Published on : 15 April 2024 4:19 PM IST

ఏమాత్రం భయపడని సల్మాన్ ఖాన్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల కలకలం జరగడం దేశ ప్రజలను షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14, ఆదివారం తెల్లవారుజామున అయన ఇల్లు, గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల కాల్పుల ఘటన జరిగింది. అయితే సల్మాన్ ఖాన్ తన పనిని మాత్రం కొనసాగించాలని భావిస్తూ ఉన్నాడు. తన మూవీ ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఎలాంటి బ్రేక్ తీసుకోకూడదని సల్మాన్ ఖాన్ తన టీమ్ కు చెప్పాడు. తన టీమ్ సభ్యులను ఎలాంటి ప్లాన్‌లను రద్దు చేయవద్దని కోరినట్లు మీడియా సంస్థలు తెలిపాయి. సల్మాన్ సినిమా కమిట్మెంట్స్ షెడ్యూల్ ప్రకారం కొనసాగనున్నాయి.. కాల్పుల ఘటనపై పెద్దగా దృష్టి పెట్టడం ఇష్టం లేదని కూడా సంబంధిత వర్గాలు తెలిపాయి.

సల్మాన్ ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొనడం లేదు.. కానీ రాబోయే రోజుల్లో అతను కొన్ని ఎండార్స్‌మెంట్‌లు, ప్రకటనల్లో నటించాల్సి ఉంది. అనుకున్న ప్రకారం తన వర్క్ క్యాలెండర్‌తో ముందుకు వెళతాడని, ఎలాంటి మార్పులు చేయడం లేదని తెలుస్తోంది. ఈ ఘటన పట్ల ఆందోళన చెందవద్దని పరిశ్రమలోని స్నేహితులు, నటులను కూడా సల్మాన్ ఖాన్ కోరాడు.

Next Story