ఇంట్లోనే చంపుతాం.. సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు
నటుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు వచ్చాయి.
By Medi Samrat
నటుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు వచ్చాయి. వర్లీలోని రవాణా శాఖకు చెందిన వాట్సాప్ నంబర్‌కు గుర్తు తెలియని వ్యక్తి.. సల్మాన్ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించి కారును బాంబుతో పేల్చి చంపుతామని సందేశం పంపాడు. ఆ గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన అనంతరం వర్లి పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదైంది. ఈ ఘటనపై ఏఎన్‌ఐని ఉటంకిస్తూ ముంబై పోలీసులు సమాచారం అందించారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.
గత కొన్నాళ్లుగా సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు వస్తున్నాయి. నవంబర్ 8, 2024న కూడా ముంబైలోని ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ ద్వారా సల్మాన్‌కి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో వర్లీ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అలాగే.. గతేడాది ఏప్రిల్ 14వ తేదీ ఉదయం బైక్‌పై వచ్చిన ఇద్దరు షూటర్లు సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ బుల్లెట్ సల్మాన్ ఇంటి గోడకు కూడా తగిలింది. సల్మాన్ ఇంట్లో అమర్చిన నెట్‌లోంచి బుల్లెట్ లోపలికి దూసుకెళ్లింది. కాల్పులు జరిపిన అనంతరం దుండగులు బైక్‌ను అక్కడే వదిలి పారిపోయారు. ఈ ఘటనపై విచారణ జరుపుతుండగా.. కాల్పులకు బాధ్యత వహిస్తూ ఫేస్‌బుక్ పోస్ట్ వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పోస్ట్‌ను జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్ అప్‌లోడ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.