సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్ టీవీలో చేసిన వ్యాఖ్యలివే.!

నటుడు, బిగ్ బాస్ 18 హోస్ట్ సల్మాన్ ఖాన్ షోలో పోటీదారులను మందలించాడు.

By Medi Samrat  Published on  21 Oct 2024 8:00 PM IST
సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్ టీవీలో చేసిన వ్యాఖ్యలివే.!

నటుడు, బిగ్ బాస్ 18 హోస్ట్ సల్మాన్ ఖాన్ షోలో పోటీదారులను మందలించాడు. తన జీవితంలో చాలా జరుగుతూ ఉండగా, మరో వైపు షోలో చిన్న చిన్న గొడవలపై కూడా స్పందించాల్సి వస్తోందని సల్మాన్ చెప్పాడు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్ చుట్టూ భద్రత పెంచారు. ఈ నేపథ్యంలో జాతీయ టెలివిజన్‌లో సల్మాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

"ఒట్టేసి చెబుతున్నా నా జీవితంలో చాలానే జరుగుతున్నాయి. అయినా కూడా నేను దీన్ని నిర్వహించాల్సి వస్తోంది" అని సల్మాన్ ఖాన్ ‘వీకెండ్ కా వార్’ ఎపిసోడ్‌లో ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించాడు. కంటెస్టెంట్స్‌లో ఒకరైన నటి శిల్పా శిరోద్కర్‌తో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ, "ఈ రోజు, నేను ఇక్కడకు రాకూడదని అనుకున్నాను. కానీ నా కమిట్మెంట్ కారణంగా నేను ఇక్కడకు వచ్చాను" అని చెప్పుకొచ్చాడు. అక్టోబర్ 12 న ముంబైలో సల్మాన్ స్నేహితుడు, ఎన్‌సిపి నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్ తన షూట్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయినప్పటికీ సల్మాన్ షోకు హాజరయ్యాడు.

Next Story