పూజా హెగ్డేతో స్టేజ్ పై సల్మాన్ చేసిన పని.. తీవ్ర విమర్శలు

Salman Khan miserably fails to perform Jumme Ki Raat hookstep with Pooja Hegde. సల్మాన్ ఖాన్ 'దబాంగ్' టూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద స్టార్స్ తో కలిసి

By Medi Samrat  Published on  27 Feb 2022 8:22 AM GMT
పూజా హెగ్డేతో స్టేజ్ పై సల్మాన్ చేసిన పని.. తీవ్ర విమర్శలు

సల్మాన్ ఖాన్ 'దబాంగ్' టూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద స్టార్స్ తో కలిసి దేశ విదేశాల్లో ఓ మంచి ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేస్తూ ఉంటాడు. సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే, దిశా పటానీ, సోనాక్షి సిన్హా ఇతరులతో పాటు ప్రస్తుతం 'ద-బాంగ్ ది టూర్ రీలోడెడ్' కోసం దుబాయ్‌లో ఉన్నారు. ఈవెంట్ కు సంబంధించిన అనేక వీడియోలు, చిత్రాలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. అభిమానులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, సల్మాన్ పూజా హెగ్డేతో కలిసి 'జుమ్మే కి రాత్'(హిందీ కిక్ సినిమాలోని పాట) హుక్‌స్టెప్ వేసే సమయంలో సల్మాన్ చేసిన చేష్టలను కొందరు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో కలిసి వేసిన పాపులర్ హుక్‌స్టెప్‌ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే ఈ టూర్ లో మాత్రం సల్మాన్ ఖాన్ పూజా హెగ్డేతో కలిసి ఈ స్టెప్ వేయాలని చూశాడు. అయితే ఆ స్టెప్ వేయడానికి అనువైన డ్రెస్ ను పూజ హెగ్డే వేసుకోలేదు. అయినా కూడా పాట రన్ అవుతున్న సమయంలో సల్మాన్ తెగ ట్రై చేశాడు. పూజ పొట్టి డ్రెస్ కారణంగా స్టెప్ వేయడం చాలా కష్టమైంది. సల్మాన్ పూజతో స్టెప్పు వేయడానికి ప్రయత్నించాడు, ఆమె కూడా ఉత్సాహంగా కనిపించింది. కానీ అతడు చేసిన పనికి సల్మాన్ ను తిట్టిపోస్తూ ఉన్నారు. సల్మాన్‌ను నెటిజన్లు ట్రోల్ చేశారు. ఆ వీడియో చూసి కింద కామెంట్లను చూడండి.. మీకే అర్థం అవుతుంది. సల్మాన్, పూజా 'కభీ ఈద్ కభీ దివాళీ' సినిమాలో కనిపించనున్నారు.


Next Story
Share it