సల్మాన్ ఖాన్‌కు ఎట్టకేలకు బిగ్ రిలీఫ్

Salman Khan has a special post to thank his fans after the relief he got in the Blackbuck case. సల్మాన్ ఖాన్ ను ఎన్నో కేసులు వెంటాడుతున్న సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on  12 Feb 2021 1:14 PM GMT
Salman Khan has a special post to thank his fans after the relief he got in the Blackbuck case

సల్మాన్ ఖాన్ ను ఎన్నో కేసులు వెంటాడుతున్న సంగతి తెలిసిందే..! అందులో కృష్ణ జింకల వేట కేసు కూడా ఒకటి. రాజస్థాన్ ప్రభుత్వం దాఖలు చేసిన రెండు పిటిషన్లను జోధ్ పూర్ జిల్లా సెషన్స్ కోర్టు కొట్టివేసింది. 2003 కి సంబంధించిన కేసులో సల్మాన్ పై వచ్చిన పిటిషన్లు కొట్టివేశామని జడ్జి రాఘవేంద్ర కచ్వాల్ సారథ్యంలోని బెంచ్తెలిపింది. దీనికి బెంచ్ కి ధన్యవాదాలు తెలిపాడు సల్మాన్ ఖాన్. ఈ కేసులో సల్మాన్ దోషిగా నిరూపితమై ఉంటే సెక్షన్ 193 కింద ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడి ఉండేది. `హమ్ సాథ్ సాథ్ హైన్` చిత్రం షూటింగ్ సమయంలో జోధ్ పూర్ సమీపంలో కంకని గ్రామంలో రెండు కృష్ణ జింకల్ని వేటాడాడనే కారణంగా సల్మాన్ అరెస్ట్ అవ్వడం అప్పట్లో పెద్ద సంచలనం అయింది. గురువారం ఈ కేసులో సల్మాన్ ఖాన్ నిర్ధోషి అని తీర్పు రావటంతో ఆయన అభిమానులు ఆనందపడుతూ ఉన్నారు.

సల్మాన్ పై రాజస్థాన్ ప్రభుత్వం దాఖలు చేసిన రెండు పిటిషన్లను కోర్టు కొట్టివేశారు. ``నా అభిమానులందరికీ .. మీ ప్రేమకు.. మద్దతుకు.. ఆందోళనకు ధన్యవాదాలు`` అనీ ఆయన అన్నారు. 2003 లో కోర్టులో తప్పుడు అఫిడవిట్ సమర్పించిన కేసులో సల్మాన్ పై రాజస్థాన్ ప్రభుత్వం దాఖలు చేసిన రెండు పిటిషన్లను కొట్టివేసింది జోధ్ పూర్ జిల్లా సెషన్స్ కోర్టు. ఒకవేళ సల్మాన్ దోషిగా నిరూపితమైతే అతనిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 193 కింద కేసు నమోదయ్యేది. దీనికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించాల్సి ఉంటుందని అతని న్యాయవాది హస్తిమల్ సరస్వత్ ఓ మీడియాకి చెప్పారు.

1998 లో `హమ్ సాథ్ సాథ్ హైన్` చిత్రం షూటింగ్ సమయంలో జోధ్ పూర్ సమీపంలోని కంకని గ్రామంలో రెండు కృష్ణ జింకల్ని (బ్లాక్ బక్స్) వేటాడినందుకు ఖాన్ అరెస్టయ్యాడు. ఆ సమయంలో సల్మాన్ పై ఆయుధ చట్టం కింద కేసు నమోదైంది. అతని ఆయుధ లైసెన్స్ సమర్పించాలని కోర్టు కోరింది. తాను లైసెన్స్ కోల్పోయానని ఖాన్ 2003 లో కోర్టులో అఫిడవిట్ సమర్పించాడు. దీనికి సంబంధించి ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్ లో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. ఏదేమైనా ఖాన్ ఆర్మ్ లైసెన్స్ కోల్పోలేదని కోర్టుకు తెలిసింది. కానీ పునరుద్ధరణ కోసం సమర్పించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ భవానీ సింగ్ భాటియా అప్పుడు సల్మాన్ పై కోర్టును తప్పుదోవ పట్టించే కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. అయితే ఖాన్ పై దాఖలు చేసిన పిటిషన్లను జోథ్ పూర్ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి రాఘవేంద్ర కచ్వాల్ తీర్పులో తోసిపుచ్చారు.
Next Story
Share it