ఆసుపత్రి పాలైన 'దేవర' విలన్

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రి పాలయ్యాడు. మోకాలు, భుజానికి గాయాలతో ఆయన ఆసుపత్రి పాలయ్యాడు.

By Medi Samrat  Published on  22 Jan 2024 8:04 PM IST
ఆసుపత్రి పాలైన దేవర విలన్

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రి పాలయ్యాడు. సైఫ్ అలీ ఖాన్ మోకాలి, భుజానికి గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. తన కొత్త చిత్రం దేవర షూటింగ్‌లో పాత గాయం తీవ్రతరం కావడంతో సోమవారం మోచేతికి శస్త్రచికిత్స జరిగింది. దేవర చిత్రంలో ఒక యాక్షన్ సీక్వెన్స్ సమయంలో 53 ఏళ్ల నటుడికి గాయం కావడంతో ముంబై నగరంలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించారు.

2017లో విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన రంగూన్ సినిమా షూటింగ్ సమయంలో గాయపడ్డాడు. ఆ గాయం తిరగబెట్టడంతో సైఫ్ సోమవారం ఆసుపత్రిలో చేరారు, అక్కడ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం సైఫ్ బాగానే ఉన్నారని తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ తదుపరి చిత్రం దేవర, ఇందులో ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో, జాన్వీ కపూర్ హీరోయిన్ పాత్రలో నటిస్తూ ఉంది.

Next Story