చెల్లెలి ఫంక్షన్ లో డ్యాన్స్ చేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్

తన సోదరి నిశ్చితార్థంలో 'సాయి పల్లవి' చేసిన డ్యాన్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ ఉంది.

By Medi Samrat  Published on  22 Jan 2024 1:30 PM GMT
చెల్లెలి ఫంక్షన్ లో డ్యాన్స్ చేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్

తన సోదరి నిశ్చితార్థంలో 'సాయి పల్లవి' చేసిన డ్యాన్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ ఉంది. నటి సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ పెళ్లిపీటలు ఎక్కబోతూ ఉంది. అందుకు సంబంధించి ఇంట్లో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సాయి పల్లవి డ్యాన్స్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన సోదరి నిశ్చితార్థంలో సాయి పల్లవి చేసిన డ్యాన్స్ ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది.

పూజా కన్నన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతోంది. తన ప్రియుడు వినీత్‌ని పెళ్లి చేసుకోనుంది. పూజా, వినీత్ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరిద్దరూ పెళ్లికి సిద్ధమయ్యారు. ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిగింది. ఇటీవల, పూజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. పూజా కూడా చిత్ర పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. పూజా కన్నన్ 'చిత్రై సెవ్వనం' అనే సినిమాలో నటించింది. అయితే ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు.. అనుకున్నంత పాపులారిటీని కూడా సంపాదించుకోలేకపోయింది.

Next Story