అఫీషియల్ ప్రకటన వచ్చేసింది.. చైతూతో సాయి పల్లవి
సాయి పల్లవి కొత్త సినిమా ఎప్పుడు చేస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు.
By M.S.R Published on 20 Sept 2023 8:11 PM ISTసాయి పల్లవి కొత్త సినిమా ఎప్పుడు చేస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా సెలెక్టివ్ గా సాయి పల్లవి సినిమాలు చేస్తూ ఉంది. అప్పుడెప్పుడో వచ్చిన గార్గి సినిమాలో సాయి పల్లవి కనిపించింది. ఆ తర్వాత కనిపించలేదు. ఇక ఇటీవలే ఆమె ఆమిర్ ఖాన్ కొడుకు సినిమాలో భాగమైందంటూ వార్తలు వచ్చాయి. అయితే దానిపై అఫీషియల్ ప్రకటన రాలేదు. గత కొద్దిరోజులుగా మాత్రం సాయి పల్లవి నాగ చైతన్యతో సినిమా చేస్తోందని కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఈరోజు సాయి పల్లవి సినిమా చేస్తోందని అధికారిక ప్రకటన వచ్చేసింది.
నాగచైతన్య కొత్త సినిమాలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జోడీగా సందడి చేయనుంది. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా వచ్చింది. ఇప్పుడు ఈ కాంబో రిపీట్ కానుంది. నాగ చైతన్య హీరోగా డైరెక్టర్ చందుమొండేటి తెరకెక్కిస్తోన్న ‘NC 23' లో సాయి పల్లవి హీరోయిన్‌గా ఎంపికైనట్లు దర్శక, నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ‘ ఈ లవ్లీ టీమ్‌లో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నన్ను ఎంచుకున్నందుకు అల్లు అరవింద్, బన్నీవాసు, చందుమొండేటికి ధన్యవాదాలు. ఓ స్పెషల్ ఫిల్మ్‌లో అక్కినేని నాగచైతన్యతో మరోసారి జోడీ కట్టుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులను చాలా మిస్ అయ్యాను. NC 23 సినిమాతో మళ్లీ మిమ్మల్ని కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను’ అని ట్వీట్ చేసింది సాయి పల్లవి. ప్రీ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. గీతాఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమానకు స్వరాలు సమకూరుస్తున్నారు.