మహేశ్.. తాను కూడా ఫిదా అయ్యానంటున్న సాయి పల్లవి
Sai Pallavi About Mahesh babu. మహేష్ బాబు.. వయసు పెరిగే కొద్దీ గ్లామర్ పెరుగుతూనే ఉంది.
By Medi Samrat Published on 17 Dec 2020 5:44 PM IST
మహేష్ బాబు.. వయసు పెరిగే కొద్దీ గ్లామర్ పెరుగుతూనే ఉంది. మహేష్ బాబు అంటే ఎంతో ఇష్టమని ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు చెబుతూ వచ్చారు. తాజాగా సాయిపల్లవి కూడా మనసులో మాటను బయట పెట్టింది. మహేశ్‌బాబు చాలా అందంగా ఉంటారని.. ఆయన స్కిన్ ఎల్లప్పుడూ మెరిసిపోతూ ఉంటుందని చెప్పింది. మహేశ్ బాబు ఫొటోలు చూస్తున్న సమయంలో లుక్స్ పరంగా ఒక వ్యక్తి ఇంత పర్‌ఫెక్ట్‌గా ఎలా ఉంటాడోనని ఆశ్చర్యపోతుంటానని తెలిపింది. మహేశ్ ముఖంపై ఒక్కమచ్చ కూడా ఉండదని చెప్పింది. చాలాసార్లు ఆయన ఫొటోల్ని జూమ్ ఇన్‌లో చూసేదానినని చెప్పింది. సాయిపల్లవి ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్ 'లవ్ స్టోరీ' లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు.
రానా గురించి కూడా సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'విరాటపర్వం' సినిమా పోస్టర్‌పై రానాతో పాటు సాయి పల్లవి పేర్లు వేయడం వెనుక కారణం రానానే అని తెలిపింది. ఆయన వల్లనే అది సాధ్యమైందని ఆమె చెప్పింది. 'విరాటపర్వం' సినిమాలో హీరోతో సమానమైన రోల్ చేశానని, అందుకే పోస్టర్‌పై హీరో రానా పేరుతో పాటు తన పేరు కూడా వేశారని సాయి పల్లవి చెప్పింది. రానా గొప్ప మనసు కారణంగానే అది సాధ్యమైందంటూ చెప్పుకొచ్చింది. యదార్ధ ఘటనల ఆధారంగా నక్సలైట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న 'విరాటపర్వం' సినిమాలో రానా, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు.