సాయి ధ‌ర‌మ్ తేజ్ కెరీర్‏లోనే బిగ్గెస్ట్ హిట్‌గా 'విరూపాక్ష'.. రికార్డ్ క‌లెక్ష‌న్లు

Sai Dharam Tej Movie Virupaksha Record Collections. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన లేటేస్ట్ చిత్రం విరూపాక్ష బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది

By Medi Samrat  Published on  26 April 2023 3:55 PM IST
సాయి ధ‌ర‌మ్ తేజ్ కెరీర్‏లోనే బిగ్గెస్ట్ హిట్‌గా విరూపాక్ష.. రికార్డ్ క‌లెక్ష‌న్లు

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన లేటేస్ట్ చిత్రం విరూపాక్ష బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. తేజ్ సరసన సంయుక్త మీనన్ నటించింది. తేజ్ కెరీర్‏లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న చిత్రంగా ఈ మూవీ నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ లోనూ భారీ వసూళ్లు రాబడుతుంది. వరల్డ్ వైడ్ గా విరూపాక్ష 5 రోజుల వసూళ్లను చిత్ర నిర్మాతలు రివీల్ చేశారు. 5 రోజుల్లో ఈ చిత్రం 55 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టు చెబుతున్నారు. విడుదలకు ముందు అన్ని ఏరియాల్లో కలిపి 22.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. విరూపాక్ష సినిమా. 23 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. ఇప్పుడు అంచనాలన్నిటినీ దాటేస్తూ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.

విరూపాక్ష చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా.. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. మిస్టిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి A సర్టిఫికేట్‌ వచ్చింది. తొలి రోజు పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న విరూపాక్ష నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి లాభాల బాటలో రన్ అవుతోంది.


Next Story